ఐటీ దాడులు, మర్రి శశిధర్‌పై భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు

Batti Vikaramarka Serious Comments On ED Raids And Shashidhar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పోడు భూముల వ్యవహరం తెరపైకి వచ్చింది. 

కాగా, పోడు భూముల సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పోడు సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైంది. పోడు రైతుల జీవితాలతో కేసీఆర్‌ సర్కార్‌ ఆడుకుంటోంది. అర్హులైన వారికి భూములు ఇవ్వలేదు. ప్రభుత్వ విధానాలతో అధికారులు, గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.  

ఇక, తెలంగాణలో దాడులపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. గతంలోనూ ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. రెగ్యులర్‌గా జరిగే రైడ్స్‌ను పార్టీలు, ప్రభుత్వం చూపించడం తప్పు. విధినిర్వహణలో జరిగే చర్యలను కూడా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేశాయి. మర్రి శశిధర్ రెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్ళేది కాదు.. కానీ వెళ్లిపోయారు. ​కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కాంగ్రెస్ పార్టీతో మర్రి కుటుంబానికి సుదీర్ఘంగా అనుబంధం ఉంది. మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. నేను జగ్గారెడ్డితో మాట్లాడుతాను. ఆయన ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాను. నాకు బేషజాలు లేవు. కాంగ్రెస్‌ పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎన్నికలకు రెడీగా ఉంటుంది.

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కడం అభ్యంతరకం. శ్రీనివాస్ రావు కాళ్లు మొక్కడాన్ని ఖండిస్తున్నాం. కాళ్లు మొక్కుతా బాంచన్‌ అనే కాలం నుంచి మనం బయటకు వచ్చాము అని కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top