మునుగోడు: బండి సంజయ్ ఆగ్రహం.. ఈసీపై షాకింగ్ కామెంట్స్!

సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కాగా, సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే, ఉప ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఇక, మునుగోడు ఎన్నికల సరళిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు. మునుగోడులో టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైంది. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంచింది. ఈసీ టీఆర్‌ఎస్‌కు కొమ్ముకాసింది. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది బీజేపీనే’ అంటూ కామెంట్స్ చేశారు.