
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధికారం చేపట్టాక గ్రామ పంచాయతీలకు నిదులిచ్చిన దాఖలాల్లేవు. కేంద్రం స్వచ్ఛభారత్ మిషన్‌సహా అనేక పథకాల ద్వారా ఇస్తున్న నిధులతోనే అవి నడుస్తున్నయ్. అయినా రూ.కోట్లు ఇస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈ విషయమై ఆయన చర్చకు రావాలి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. సోమ వారం రాత్రి పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, ఎస్.కుమార్‌లతో కలసి సంజయ్ మీ డియాతో మాట్లాడారు. కార్పొరేట్ విద్యాసంస్థలు పదోతరగతి, ఇంటర్ ఫలితాలు వచ్చాక టీవీల్లో 1... 2... 3.. ర్యాంకులు మావే అని ప్రకటనలు ఇచ్చినట్టు సీఎం కేసీఆర్ ఏ సభకు వెళ్లినా కోట్లకు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించడంతప్ప పైసలివ్వరని ఎద్దేవా చేశారు. నారాయణఖేడ్ సభలో ౖకేసీఆర్ చెప్పిన మాటలు వాటినే గుర్తుకు చేశాయన్నారు.
కొడుకు లొల్లి చేస్తుండు, అందుకే..
‘హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హు జూరాబాద్ సహా జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు గిట్ల నే చెప్పి పైసా ఇవ్వలేదు’అని విమర్శించారు. దు బ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనం కేసీఆర్ గూబగుయ్‌మన్పించినా సిగ్గు రా వడం లేదన్నారు. ‘సీఎం పదవి ఇవ్వాలని ఇంట్లో కొడుకు లొల్లి చేస్తుండు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ డ్రామా చేస్తుండు’అని వ్యా ఖ్యానించారు. ‘ఇక్కడి పంచాయతీలన్నీ కేంద్ర నిధు లతో నడస్తున్నవే. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా నిధులివ్వని చరిత్ర నీది’అని మండిపడ్డారు. ‘తుక్డేగ్యాంగ్ ప్రకాశ్‌రాజ్‌తో కలసినవంటే కేసీఆర్లో హిందూ వ్యతిరేక భావజాలం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. తుక్డేగ్యాంగ్ పోటీ చేస్తే జనం ఓడించిండ్రు. అయినా కలిసినవంటే కారణమేంది?’అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో కేసీఆర్ పీకిందేమీ లేదు. ఇగ దేశ రాజకీయాల్లోకి వెళ్లి పీకేదేముంది? కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ఆత్మహత్యలు పెరిగిపోయినయ్. ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. జనం తిరగబడుతుంటే, ఈ కొత్త డ్రామాలు మొదలు పెట్టిండు’అని సంజయ్ అన్నారు.