సీకే కుటుంబానికి సీటిస్తే ఊరుకోం | Balija Association Leaders Fire On CK Babu Chittoor Mayor | Sakshi
Sakshi News home page

సీకే కుటుంబానికి సీటిస్తే ఊరుకోం

Oct 14 2026 9:57 AM | Updated on Oct 14 2026 10:04 AM

Balija Association Leaders Fire On CK Babu Chittoor Mayor

సాక్షి, చిత్తూరు: సీకే కుటుంబానికి చిత్తూరు మేయర్‌ అభ్యర్థిత్వం ఇస్తే ఊరుకోమని బలిజ సామాజిక వర్గం నేతలు, పెద్దలు స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి తొలుత బలిజ కులస్తులు పూలమాలలు వేసి ఘనంగాని వాళులర్పించారు. అనంతరం  విలేకర్లతో మాట్లాడుతూ  మేయర్‌ పదవిపై తమ వైఖరిని స్పష్టం చేశారు. సుమారు 10 రోజులుగా చిత్తూరు నగరంలో ఒక రూమర్‌ జోరుగా ప్రచారంలో ఉందని బలిజ సంఘ నేతలు ఓఎం రామదాసు, కిషోర్‌  తెలిపారు. సీకే కుటుంబానికి మేయర్‌ పదవి ఇస్తున్నారనే వార్తలు వ్యాపిస్తుండడంతోనే, నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు ఈ అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

దాదాపు 40 ఏళ్లుగాచిత్తూరు ప్రాంతంలో మంచి పరిపాలన అందించిన ఘనత బలిజ సామాజిక వర్గ నేతలదే అని స్పషటం చేశారు. తొలినాళ్ల నుంచి టీడీపీకి, చంద్రబాబుకు బలిజలు కొండంత అండగా నిలుస్తున్నారని వెల్లడించారు.  గతంలో సీకే కుటుంబం చేసిన అరాచకాలు, బలిజలను తొక్కి నాశనం చేసిన దారుణమైన ఘటనలను ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు. తమ ఆవేదన, విజ్ఞప్తిని అధిష్టానం స్వీకరించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.. చిత్తూరు మేయర్‌ అభ్యర్థిగా బలిజ సామాజిక వర్గానికి చెందిన వారినే నిలబెట్టాలన్నారు. 

ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, ఇది తమ ప్రధాన డిమాండ్‌ అని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో దాదాపు కోటి మందికి పైగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలను కేవలం ఓట్లు వేయించుకోవడానికే రాజకీయ నాయకులు వాడుకుంటున్నారని, గుర్తింపు ఇవ్వడంలో మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చిత్తూరు మేయర్‌ పదవిని తమ వర్గానికే కేటాయించాలని, లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  కార్యక్రమంలో కిషోర్, గోపి, ఆరణి తులసి, వీకే విశ్వనాథం, కోళ్ల కిరణ్, కాజూరు రాజేష్‌, యశ్వంత్, శేఖర్, రెడ్డిగుంట రమేష్‌ , యుగంధర్, కంద, ప్రభాకర్, పూలచందు పాల్గొన్నారు.  


శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం వద్ద మాట్లాడుతున్న బలిజ సంఘం నేతలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement