Arvind Kejriwal Took A Jibe At LG VK Saxena Over Love Letters - Sakshi
Sakshi News home page

‘ఎల్‌జీ సాబ్‌ జస్ట్‌ చిల్‌.. మీలా నా భార్య సైతం చేయలేదు’.. కేజ్రీవాల్‌ ట్వీట్‌

Published Thu, Oct 6 2022 5:57 PM | Last Updated on Thu, Oct 6 2022 6:33 PM

Arvind Kejriwal Took A Jibe At LG VK Saxena Over Love Letters - Sakshi

గవర్నర్‌ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్‌ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఆరు నెలల్లో గవర్నర్‌ రాసినన్ని లవ్‌ లెటర్లు.. తన భార్య కూడా రాయలేదంటూ ట్వీట్‌ చేశారు. తనను తిట్టటం, లేఖలు రాయటానికి కాస్త విరామం ఇచ్చి కాస్త సేదతీరండీ అంటూ సూచించారు. 

‘ప్రతి రోజు ఎల్‌జీ సాబ్‌ తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టలేదు. గడిచిన ఆరు నెలల్లో ఎల్‌జీ సాబ్‌ రాసినన్ని లవ్‌ లెటర్లు నా భార్య సైతం రాయలేదు. ఎల్‌జీ సాబ్‌ కొద్దిగా చల్లబడండి. అలాగే.. కొద్దిగా సేదతీరమని మీ సూపర్‌ బాస్‌కి సైతం చెప్పండి.’ అని హిందీలో ట్వీట్‌ చేశారు కేజ్రీవాల్‌. ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్‌ బాడీల్లో రూ.6000 కోట్ల స్కాం జరిగిందని, దానిపై దృష్టి పెట్టండంటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సిసోడియా లేఖకు ఎల్‌జీ సక్సేనా ఎలాంటి స‍్పందన తెలియజేయలేదు. కానీ, బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది.

ఇదీ చదవండి: వందేభారత్‌ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement