ఏపీలో కూడా పవన్‌ అట్టర్ ప్లాఫ్‌ కావడం ఖాయం: గిడుగు రుద్రరాజు | APCC President Gidugu Rudraraju Comments On Pawan Kalyan Janasena Party Over Ahead Of Assembly Elections - Sakshi
Sakshi News home page

ఏపీలో కూడా పవన్‌ అట్టర్ ప్లాఫ్‌ కావడం ఖాయం: గిడుగు రుద్రరాజు

Dec 22 2023 11:56 AM | Updated on Dec 22 2023 12:57 PM

Apcc President Gidugu Rudraraju Comments On Pawan Kalyan - Sakshi

పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు, సిద్ధాంతాలపై  క్లారిటీ లేదని.. మొన్నటి దాకా లెఫ్ట్ అన్నారు.. ఇప్పుడు రైట్ అంటున్నారంటూ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు.

సాక్షి, ఢిల్లీ: పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు, సిద్ధాంతాలపై  క్లారిటీ లేదని.. మొన్నటి దాకా లెఫ్ట్ అన్నారు.. ఇప్పుడు రైట్ అంటున్నారంటూ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో  సాక్షి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాప్‌ అయ్యారని, ఏపీలో కూడా అట్టర్ ప్లాఫ్‌ కావడం ఖాయమన్నారు.

తెలంగాణలో పవన్ కళ్యాణ్, బీజేపీ..  బీసీ సీఎంను ప్రకటించారు. మరి ఏపీలో కూడా పవన్, చంద్రబాబు బీసీని సీఎంను చేస్తామని ప్రకటిస్తారా ? అని గిడుగు ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఐ, సీపీఎంతో కలిసి పొత్తు పెట్టుకుంటాం. ఈ అంశంపై త్వరలోనే ఏఐసీసీ  పెద్దలతో స్ట్రాటజీ మీటింగ్ ఉంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచురిని కలుస్తా. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఏపీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి ఇండియా కూటమిగా పోటీ చేస్తాం’’ అని రుద్రరాజు పేర్కొన్నారు. 

దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది. పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్ దీనికి నిదర్శనం. దీనికి నిరసనగానే జంతర్ మంతర్‌లో ధర్నాకు దిగామని గిడుగు రుద్రరాజు అన్నారు.

ఇదీ చదవండి: బానిసగా మారిన గురువు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement