ఉంగరాల సింగరాజు రింగులో ఫింగరు! | Sakshi
Sakshi News home page

ఉంగరాల సింగరాజు రింగులో ఫింగరు!

Published Fri, Feb 23 2024 9:28 AM

AP Politics: This Why Pawan Wore Two Rings Always - Sakshi

పదిహేనేళ్ల నుంచీ రాజకీయాలు చేస్తున్నా తనకు రాజకీయ నాయకుడి ముద్ర,  ఆ  గుర్తింపు లేకపోవడం, ఎంతసేపూ తనను సినిమా హీరోగానే ప్రజలు చూస్తుండడం.. అటు టీడీపీ, వైఎస్సార్‌సీపీ కేడర్‌, ఆ పార్టీ నాయకులు సైతం తనను ప్యాకేజీ స్టార్ అని అవమానిస్తుండడంతో..  ఇక లాభం లేదు, ఎలాగైనా తన జాతకం మార్చాలని.. మార్చుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడైన పవన్ కళ్యాణ్ ఓ రోజు బురఖా వేసుకుని టాంక్ బండ్ మీద చిలక జోతిష్యం చెప్పే వారి దగ్గరకు వెళ్ళాడు.

అక్కడ చెట్టుకు చేరబడి బీడీ కాలుస్తున్న జ్యోతిష్యం గంగరాజు ఒక్కసారి ఈ బురఖా చూసి ఎలర్ట్ అయ్యాడు. బేరం తగిలిందని సంబరపడుతూ  రామ్మా..చిలకమ్మా మంచి బేగం బేరం వచ్చిందమ్మా అంటూ పవన్‌ను చాపమీద కూర్చోబెట్టాడు.  చేతిని చూసి అమ్మా మిమ్మల్ని చూస్తుంటే అమ్మాయి కానట్లుంది.. మీకు మగ లక్షణాలే ఉన్నాయి దానికితోడు మీకు మూడునాలుగు పెళ్ళిళ్ళు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు రాజకీయంగా కూడా ఎదుగుదల లేదు. ఎంతసేపూ వేరేవారి ఎదుగుదలకు మీరు పనికొస్తారు తప్ప మీ క్రేజీ మీకు పనికిరాదు. మీరు పోటీ చేసినా ఓడిపోయే ప్రమాదాలు ఉన్నాయి.. మీకు కళారంగమే పనికొస్తుంది..అందులు ట్రై చేయండి అంటూ చెబుతున్నాడు.

దీంతో లోపలున్న పవన్ చిరాకుపడుతూనే బయటికి మాత్రం ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. గొంతు మార్చి ‘‘మరి నాకు విరుగుడు చెప్పండి స్వామీ.. ఏమి చేయాలో చిలుకను అడగండి’’ అన్నాడు. మళ్లీ గంగరాజు చిలుకను రావమ్మా సోనాలి బింద్రే.. ఈ బురఖా బుజ్జమ్మకు మంచి కార్డ్ తీసి ఫ్యూచర్ చూపించమ్మా అన్నాడు.  అంతసేపూ లోపల జామకాయ తింటూ ఏదో మూడ్లో ఉన్న చిలక.. షిరాగ్గా మొహం పెట్టి ‘ఎన్నిసార్లు పిలుస్తావురా?..’ అన్నట్లు చూసింది. దాని శిరాకు చూసి గంగరాజుకు భయమేసింది.

అయినా సరే ‘ఒసే సోనాలి.. మనిద్దరం పొట్లాడుకుంటే వచ్చే బేరం పోతుంది . ఈసారికి వచ్చి ఏదో కార్డ్ తీసి మొహాన కొట్టిపోవే’ అన్నాడు వేరే భాషలో. దీంతో సరే అడుక్కుంటున్నవు కాబట్టి వస్తున్నా అన్నట్లు చూసి మెల్లగా బయటికి వచ్చి ఓ పాము బొమ్మ ఉన్న కార్డ్.. తాబేలు బొమ్మ కార్డు తీసి బయట గిరాటేసి. ‘ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేస్తే పారిపోతాను’ అన్నట్లు వార్నింగ్ లుక్కేసి పెట్టెలో దూరింది.

దీంతో బురఖా లోపలున్న పవన్ ఆ కార్డులు చూసి ఇదేంటి స్వామి పాములు తాబేళ్లు అంటోంది(అంటాడు). ‘‘నేనేమైనా వాటి యపారం చెయ్యాలా?’’ అన్నాడు కంగారుగా!. దీంతో గంగరాజు చిరునవ్వు నవ్వి ‘లేదు అమ్మా.. మీరు ఈ రెండు బొమ్మలున్న ఉంగరాలు పెట్టుకోండి. ఇక మీకు తిరుగే ఉండదు.. మా సోనాలి మీద ఒట్టు’ అన్నాడు.. హమ్మయ్య బ్రతికించాడు అనుకుని పవన్ వెంటనే రెండువేలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ మరునాడే చేతికి ఉంగరాలు వచ్చాయి.. తాబేలు.. పాము ఉన్న ఉంగరాలతో జనంలోకి వచ్చి చేతులు తిప్పుతున్నారు. అదన్నమాట పవన్ గారి ఉంగరాల కథ!

✍️ సిమ్మాదిరప్పన్న

Advertisement

తప్పక చదవండి

Advertisement