AP: పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On Feb 2nd In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Feb 2nd: పొలిటికల్ అప్‌డేట్స్

Published Fri, Feb 2 2024 6:55 AM

AP Political Updates Feb 2nd - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

9:30 PM, Feb 2nd, 2024
మీ బతుకుల నిండా అబద్ధాలు.. తప్పుడు ప్రచారాలే

 • ఈసారి కూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పుతో టీడీపీకి శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారు
 • రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జీతాలు, అలవెన్సులు రూపంలో సలహాదారులకు, వారి సిబ్బందికి, ఇంటి అద్దెరూపంలో, కారు సౌకర్యం రూపంలో మొత్తంగా చెల్లించింది కేవలం రూ.48.33 కోట్లు
 • ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన సిబ్బందికి, కారు, ఇంటి అద్దె అలవెన్స్‌ రూపంలో చెల్లించింది కేవలం రూ.165 లక్షలు.
 • మరి ఈ రూ.140 కోట్లు లెక్క ఎక్కడిది?
 • రోజురోజుకి పచ్చి అబద్ధాలు చెప్తూ సిగ్గూ, శరంలేకుండా ప్రవర్తిస్తుంది టీడీపీ
   

9:23 PM, Feb 2nd, 2024
టీడీపీ వాళ్లకే జనసేన టికెట్‌లు

 • జనసేన ముసుగులో పోటీ చేయబోయేది తెలుగుదేశం నేతలే
 • పవన్‌ కళ్యాణ్‌కు తెలియడం లేదు.. బాబు ఇప్పటికే వెన్నుపోటు పొడిచాడని..
 • కాకినాడ ఎంపీ అభ్యర్థే అందుకు ఉదాహరణ
 • సాన సతీష్‌ లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు
 • జన సైనికుల్లో ఆందోళన
 • ఇదీ చంద్రబాబు మార్కు రాజకీయం అంటున్న పలువురు రాజకీయ విశ్లేషకులు

8:58 PM, Feb 2nd, 2024
రీజనల్ ఇన్‌ఛార్జ్‌లుగా వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాస్‌ నియామకం

 • అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు రీజనల్ ఇన్‌ఛార్జీగా వైవీ సుబ్బారెడ్డి
 • అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు, దీంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావు డిప్యూటీ రీజినల్ కో- ఆర్డినేటర్‌గా నియామకం
 • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం

8:52 PM, Feb 2nd, 2024
వైఎస్సార్‌సీపీ ఆరో జాబితా విడుదల 

 • నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన

6:44 PM, Feb 2nd, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల టెన్షన్ టెన్షన్ 

 • వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసం చూస్తోన్న టీడీపీ 
 • పార్ధసారథి, వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిక ఖాయమంటున్న పార్టీ నేతలు
 • తిరువూరు నియోజకవర్గంలో తెరపైకి కొలికలపూడి శ్రీనివాసరావు
 • ఆందోళనలో ప్రస్తుత తిరువూరు ఇంచార్జ్ శావల దేవదత్
 • పార్ధసారథిని నూజివీడుకి ఒప్పించేందుకు టీడీపీ హైకమాండ్ నానా హైరానా
 • మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో ఉత్కంఠ
 • దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్
 • ఒకరికి పెనమలూరు, మరొకరికి మైలవరం కేటాయించేందుకు ప్రయత్నాలు
 • ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా హైకమాండ్ సర్వేలు
 • విజయవాడ పశ్చిమ టీడీపీ లో గందరగోళం
 • బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు
 • పొత్తులో భాగంగా జనసేన కు ఇచ్చే సీట్లపై రాని క్లారిటీ
 • విజయవాడ పశ్చిమ, అవనిగడ్డలు జనసేనకు అంటూ ప్రచారం
 • నూజివీడులో ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు
 • తనని విస్మరిస్తే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటూ ముద్రబోయిన హెచ్చరికలు

6:39 PM, Feb 2nd, 2024
జీవితాంతం సీఎం జగన్‌తోనే ఉంటా: కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

 • తాను పార్టీ మారుతానంటూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు
 • నేను సీఎం జగన్‌ని కాదని ఎక్కడకూ వెళ్లను
 • సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రెండుసార్లు సీఎం జగన్‌ బీఫామ్‌ ఇచ్చారు
 • సీఎంకి జీవితాంతం రుణపడి ఉంటా
 • టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు
 • నాకు ఇద్దరు దేవుళ్లు.. ఒకరు సీఎం జగన్‌, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి
 • నా రాజకీయ దేవుడు వైఎస్‌ జగన్‌ ఏం చెబితే అది చేస్తా
 • కనిగిరిలో కొత్త ఇన్‌ఛార్జ్‌కి పూర్తిగా సహకరిస్తాం
 • సీఎం జగన్‌ ఎవరికి చెబితే వారికి పని చేస్తాం
 • నాపై ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు
 • కానీ అదేం లేదు.. అందరం కలిసి పనిచేస్తాం
 • కనిగిరి కొండమీద వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం
 • సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండను
 • సీఎం జగన్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది
 • దాన్ని ఎవరూ మార్చలేరు

6:05 PM, Feb 2nd, 2024
భీమవరంలో పోటీ చేసే దమ్ముందా?

 • పవన్‌కల్యాణ్‌, చంద్రబాబుకు విప్‌ గ్రంథి శ్రీనివాస్‌ సవాల్‌
 • దమ్ముంటే ఇద్దరు భీమవరం నుంచే తనపై పోటీ చేయాలని పిలుపు
 • ఓడిపోతానన్న భయంతోనే టీడీపీతో పవన్‌ పొత్తు
 • సిద్ధాంతంలేని రాజకీయ ఉసరవెల్లి పురందేశ్వరి
 • బీజేపీలో ఉండి టీడీపీ కోసం పనిచేస్తున్నారు
 • ఆమె మాటలు విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు.
   

4:52 PM, Feb 2nd, 2024
టీడీపీ-జనసేనల మధ్య మనస్పర్థలు

 • నియోజకవర్గాలపై ఇంకా రాని స్పష్టత 
 • పాదయాత్రల పేరిట రెండు పార్టీల నాయకుల బలప్రదర్శన 
 • జనసేన బలంగా ఉన్న చోట టిడిపి నేతల పాదయాత్రలు 
 • పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన మహా పాదయాత్ర 
 • సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాదయాత్ర 
 • గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన యాత్ర
 • బలం చూపించుకోవాలని పోటాపోటీగా తాపత్రయపడుతోన్న క్యాడర్‌
 • పొత్తుల తక్కెడలో తేలని లెక్కలతో చొక్కాలు చించుకుంటోన్న పవన్‌, బాబు

4:48 PM, Feb 2nd, 2024
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి.. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ సత్యవతి

 • విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలి
 • నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఏపీలో జాతీయ ఆహార భద్రత రేషన్ కార్డుల కవరేజ్ పెంచాలి
 • తుపాన్లతో ఏపీ తరచూ తీవ్రంగా నష్టపోతోంది
 • తుపానుల నుంచి ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలి
 • విద్యారంగంలో, సులభతర వాణిజ్యం, మత్స్య రంగంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది

3:49 PM, Feb 2nd, 2024
ప్రతిపక్షాల కుట్రలు తిప్పికొడతాం: ఎమ్మెల్యే అనిల్

 • ఏలూరులో జరగబోయే సిద్దం సభకు పామర్రు నియోజకవర్గం నుంచి అపూర్వ స్పందన రాబోతోంది 
 • ఎన్నికలకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు  
 • ఈ రాష్ట్రానికి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు 
 • ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగాలి 
 • మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం 
 • టీడీపీ, జనసేన మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కుట్రలను తిప్పికొడతాం  
 • జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు ఏలూరు సభలో శంఖారావం పూరించబోతున్నాం

పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యలు

3:23 PM, Feb 2nd, 2024
ఆరో జాబితాపై వైఎస్సార్‌సీపీ ఫోకస్‌

 • పలువురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్న సీఎం జగన్‌
 • సీఎంవోకు వచ్చిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్‌, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, నెల్లూరు అర్బన్‌ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌
 • ఇటీవలె నరసరావుపేట ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా అనిల్‌కు ప్రమోషన్‌

3:17 PM, Feb 2nd, 2024
వార్‌ వన్‌ సైడే: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

 • టీడీపీ నేతలు బ్రోకర్ రాజకీయాలు మానుకోవాలి
 • ఎన్నికల ముందే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు
 • బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అని.. చంద్రబాబు 9ఏళ్ల పాలనలో ఏమి చేశాడో చెప్పాలి
 • 2019 ఎన్నికలు ఒకలెక్క 2024 ఒకలెక్క వార్ వన్ సైడ్ గా ఉంటుంది
 • ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలి
 • మా టార్గెట్ 175/175 గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తాం
 • గ్రామాల్లో ఎక్కడ చూసినా జగనన్న సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి,
 • చంద్రబాబుకు కుళ్లు కుతంత్రాలు చేసే రాజకీయాలు తప్ప ఏమీ తెలియదు,
 • చంద్రబాబు పాలన మొత్తం అవినీతి పాలన
 • ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు ఉందా?
 • ప్రతి గడప గడపకు వెళ్ళి చంద్రబాబు తీరుని ఎండగడతాం

నందికొట్కూరులో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వ్యాఖ్యలు

2:49 PM, Feb 2nd, 2024
పవన్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు?: కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు 

 • గజ దొంగల ముఠా నుంచి ప్రజలను కాపాడేందుకు దీటుగా సీఎం జగన్‌ కార్యకర్తలను సిద్ధం చేయనున్నారు
 • చంద్రబాబు విజన్ ఏంటో 14 ఏళ్లగా ప్రజలు గమనిస్తున్నారు
 • బూటకపు స్కీముల ద్వారా చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని జన్మభూమి కమిటీలకు తప్ప ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవు
 • సీఎం జగన్‌ తెచ్చిన సంక్షేమ పథకాల పేర్లు కూడా చెప్పేందుకు అరగంట సమయం పడుతుంది 
 • ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంస్కరణలు, ఇంత అభివృద్ధి జరగలేదు
 • విద్య, వైద్యం ఫ్రీగా అందిస్తున్న నాయకుడు దేశంలోనే సీఎం జగన్‌ ఒక్కరే
 • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 175కు 175 గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతి కార్యకర్త రానున్నారు
 • పవన్  కాపులకు ఏమి చేశాడు?
 • 2014 నుంచి ఒక్క పదవి కూడా కాపు సోదరులకు ఇప్పించలేదు.. 2024లో ఏమి ఇప్పిస్తాడు
 • 200కు పైగా కాపు నేతలకు పదవులు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్
 • కాపులను సీఎం జగన్‌ ఆర్థికంగా రాజకీయంగా ఆదుకున్నారు
 • పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు...?

1:45 PM, Feb 2nd, 2024
మోసం చేసేందుకు బాబు డ్రామా కంపెనీ సిద్ధమైంది: వైవీ సుబ్బారెడ్డి.

 • డ్వాక్రా అక్కచెల్లెమ్మలను చంద్రబాబు ఘోరంగా మోసం చేశారు
 • రాష్ట్రంలో రాబోయే తరానికి ఉపయోగపడే విధంగా సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అందించారు. 
 • ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన చేశారు
 • 2014లో మోసం చేసినట్టే.. ఇప్పుడు కూడా మోసం చెయ్యడానికి మళ్లీ డ్రామా కంపెనీ సిద్ధమైంది. 
 • టీడీపీ, జనసేన మళ్లీ నాటకాలు మొదలుపెట్టారు. 

1:30 PM, Feb 2nd, 2024
షర్మిల దీక్ష బాబు డ్రామాల్లో భాగమే: మంత్రి మేరుగు

 • ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల ఢిల్లీలో దీక్షపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్‌
 • షర్మిల ఈ నాలుగున్నర సంత్సరకాలంగా ప్రత్యేక హోదా గురించి మార్చి పోయిందా?
 • ఆమెకు ఇప్పుడే గుర్తొచ్చిందా?
 • ఇప్పుడు ఎవరు చెప్తే ఢిల్లీ వెళ్ళింది
 • ఎవరిని దూషించడానికి వెళ్ళిందో చెప్పాలి
 • ఇవన్నీ చంద్రబాబు చేస్తున్న నాటకాలు, డ్రామాలలో భాగమే. 
   

1:10 PM, Feb 2nd, 2024
చంద్రబాబుపై అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఫైర్‌

 • చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు. 
 • ఎవరో రాసింది చదివి నాపై ఆరోపణలు చేస్తున్నారు.
 • రాజమండ్రి సభలో నాపై, నా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసి ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడు.
 • చంద్రబాబు పేర్కొన్న గ్రావెల్ అవతలకు సంబంధించి ఎవరి ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయో చూసుకోవాలి.
 • అనుమతులకి సొమ్ము చెల్లించామని చెబుతున్న వ్యక్తులు సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూనే మూడేళ్లుగా ముందుకు రావడం లేదు.
 • అబద్ధాలు, మోసం, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.
 • అదే అనుభవంతో అనపర్తి టీడీపీ మాజీ  ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి శిక్షణ ఇచ్చారు.
 • దీంతో అనపర్తి నియోజకవర్గం 2014 నుండి 2019 వరకు అవినీతి కూపంలా మారింది.
 • టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ మనీ పేరుతో అనపర్తి ప్రాంత వడ్డీ వ్యాపారులను వేధింపులకు గురి చేశారు. 
 • అనపర్తి ప్రజలు ఎప్పటికీ ఇది మర్చిపోరు.
 •  2019 తర్వాత అనపర్తి నియోజకవర్గంలో రాజకీయ అవినీతి లేదన్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు.
 • ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎంతమందితో పొత్తులు పెట్టుకువచ్చినా అంతిమంగా ప్రజలు గెలిపించేది సీఎం జగన్‌నే.

12:45 PM, Feb 2nd, 2024
షర్మిల కండువా కాంగ్రెస్‌ది.. స్క్రిప్ట్‌ చంద్రబాబుది: మంత్రి రోజా ఫైర్‌

 • కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య 
 • షర్మిల మెడలో కండువా కాంగ్రెస్‌ పార్టీది.. ఆమె చదివే స్క్రిప్ట్‌ మాత్రం చంద్రబాబుది
 • మూడుసార్లు సీఎంగా చేస్తే మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. 
 • మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారు. 
 • నాడు ఎన్టీఆర్‌ కుటుంబంతో ప్రారంభమై నేడు వైఎస్సార్‌ కుటుంబం వరకు వచ్చాడు.
 • ఇలాంటి అవకాశం ఇచ్చిన షర్మిలది తప్పు. 
 • వైఎస్సార్‌ కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మక​ం ప్రజల్లో ఉంది. 
 • వైఎస్సార్‌ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారు. 
 • ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. 
 • వైఎస్సార్‌పార్టీ నుంచి తరిమేసిన నాయకులను అభ్యర్థులుగా పెట్టుకునే పరిస్థితికి దిగజాగారు. 
 • తెలంగాణ అని పార్టీ పెట్టి, అక్కడ కాంగ్రెస్, టీడీపీ, జనసేన గురించి ఏం చేశారో ప్రజలు గమనించారు. 
 • ఇప్పుడు ఆంధ్రాలో అబద్ధాలు మొదలు పెట్టారు. 
 • ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు’ అని అన్నారు. 
 • నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అంటున్న నాయకులు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
 • నగరి నియోజకవర్గంలో అభివృద్ధి వచ్చి చూస్తే కళ్ళకు కనిపిస్తుంది

12:30PM, Feb 2nd, 2024

పేదలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌దే: మంత్రి పెద్దిరెడ్డి

 • సమన్వయకర్తల నియామకంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తున్నారు
 • వైఎస్ కుటుంబాన్ని చీల్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు
 • ప్యాకేజీ కోసం.. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడే 
 • టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి
 • విశాఖ రైల్వే జోన్‌కు జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది
 • స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం చేస్తున్నారు
   

12:25PM, Feb 2nd, 2024

జగనన్న తలపెట్టిన సిద్ధం సభకు అందరూ సిద్ధంకండి: వెల్లంపల్లి

 • సీఎం జగన్ తలపెట్టిన సిద్ధం కండి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
 • మూడు సంవత్సరాలు కాలంలో మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలి
 • విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వేల ప్రజలు తరలి వెళ్తున్నాం
 • సీఎం జగన్ సభకు మద్దతు ఇచ్చే విధంగా అన్ని ప్రాంతాల నుండి తరలి వెళ్తున్నాం
 • సీఎం జగన్ పాలనలో శాంతినగర్ ప్రగతి కాలనీ ప్రశాంతి నగర్ రోడ్లు అద్భుతంగా ఉన్నాయి
 • సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలందరూ ఆకర్షితులు అవుతున్నారు
 • గతంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చిన సందర్భాలు లేవు
 • ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యేలు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే

12:21PM, Feb 2nd, 2024

పవన్‌.. కనీసం గ్లాస్‌ గుర్తునైనా పోటీలో పెట్టు: ద్వారంపూడి సవాల్‌

 • రేపు ఏలూరులో జరిగే సభకు 75 బస్సులు..100 కార్లలో తరలివెళ్తున్నాం
 • గడిచిన ఐదేళ్ళ కాలంలోసీఎం జగన్‌ అందించిన సంక్షేమ పాలనలో పేదరికం తొలగింది
 • చంద్రబాబును ఎత్తడం కోసమే జనసేన మేము సిద్దం అంటుంది.
 • నాపై పోటీ చేయమని పవన్ కళ్యాణ్‌కు సిద్ధం అని చెబుతున్నా
 • కనీసం నామీద గ్లాస్ గుర్తునైన పోటీలో పెట్టమని సవాల్ చేస్తున్నా
   

11:10AM,  Feb 2nd, 2024

సుప్రీంకోర్టులో రామోజీకి బిగ్‌షాక్

 • మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన ఏపీలో కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న మార్గదర్శి వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
 • ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు
 • కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించండి
 • ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోండి
 •  కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా అని వ్యాఖ్యానించిన ధర్మాసనం
 • ఏపీ ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు ఇలా..

 • ఆంధ్రప్రదేశ్‌లోనే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నేరాలకు పాల్పడింది.
 • ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదు. 
 • ఏపీలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఏటా రూ.3,274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తోంది.
 • ఏపీ సీఐడీ పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. 
 • చిట్‌ఫండ్స్‌ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలి. 
 • ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉందన్న కారణంగా ఇక్కడ కేసుల బదిలీకి ఆధారం కాదు. 
 •  ఏపీ హైకోర్టు న్యాయపరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలోని చెప్పింది. 
 • ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన న్యాయస్థానం.  కేసులో దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చేస్తోంది.

11:00AM, Feb 2nd, 2024

రాష్ట్రానికి సుపరిపాలన అందించిన నాయకుడు సీఎం జగన్: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

 • గత ప్రభుత్వ హయాంలో రాస్తున్న పేదలకు ఒక అంగుళం స్థలం కూడా లభించలేదు
 • సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ 31 లక్షల ఇళ్ల పట్టాలని అందజేసి వారి ఇళ్ళు నిర్మిస్తున్నారు
 • రాష్ట్రంలో గృహ నిర్మాణం ఒక యజ్ఞంలా జరుగుతుంది
 • ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్  అనేక చర్యలు చేపడుతున్నారు
 • స్కిల్ డెవలప్మెంట్  పేరుతో యువతను మోసం చేసి కోట్లాది రూపాయలు కొట్టేసిన నాయకుడు చంద్రబాబు
 • చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన 14 సంవత్సరాల కాలంలో ఒక్క మంచి పథకం కూడా లేదు
 • జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు జనాన్ని దారుణంగా దోచుకున్నారు
 • సైకిల్‌ను షెడ్డులో పెట్టడానికి జనం సిద్ధపడుతున్నారు
 • జనసేనతో చంద్రబాబు అనైతిక పొత్తు  ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళుతున్నారు ప్రజలు కచ్చితంగా వీరిని తిరస్కరిస్తారు
 • సిఎం జగన్‌ను మరోసారి ప్రోత్సహించండి... రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది

10:45AM, Feb 2nd, 2024

అది ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే  బుర్రా మధుసూదన్‌యాదవ్‌

 • పార్టీ మారతానంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు
 • నేను సీఎం జగన్‌ని కాదని ఎక్కడకూ వెళ్లను
 • సామాన్య కుటుంబ నుంచి వచ్చిన నాకు రెండు సార్లు జగన్ బీఫామ్ ఇచ్చారు
 • సీఎంకి జీవితాంతం రుణపడి ఉంటా
 • టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు
 • నాకు ఇద్దరు దేవుళ్లు, ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి
 • నా రాజకీయ దేవుడు జగన్ ఏం చెబితే అది చేస్తా
 • కనిగిరిలో కొత్త ఇన్ఛార్జికి పూర్తిగా సహకరిస్తాం 
 • జగన్ ఎవరికి చెబితే వారికి పని చేస్తాం
 • నామీద ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు
 • కానీ అదేంలేదు. అందరం కలిసి పనిచేస్తాం 
 • కనిగిరి కొండమీద వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం
 • సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండను
 • జగన్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది
 • దాన్ని ఎవరూ మార్చలేరు

9:50 AM, Feb 2nd, 2024

విజయవాడ వెస్ట్ టీడీపీలో టిక్కెట్ రచ్చ

 • చంద్రబాబుకు తలపోటుగా మారిన వెస్ట్ టిక్కెట్ పంచాయతీ
 • తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ ర్యాలీ చేసిన బుద్ధా వెంకన్న
 • మైనార్టీ కోటాలో తనకే టిక్కెట్ ఇవ్వాలంటున్న జలీల్ ఖాన్
 • తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటున్న జలీల్ ఖాన్
 • బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ వ్యాఖ్యలతో టీడీపీలో అయోమయం... జనసేన పార్టీలో కలవరం
 • వెస్ట్ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న జనసేన పోతిన మహేష్

8:00 AM, Feb 2nd, 2024

పురందేశ్వరి, పవన్‌లపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధ్వజం

 • ఊసరవల్లిలా పార్టీలు మారే పురందేశ్వరి వైఎస్సార్‌సీపీని విమర్శించడం తగదు
 • పురందేశ్వరి  బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీ విషతుల్యం అయ్యింది
 • బీజేపీ నేతలు కార్యకర్తలు పురందేశ్వరి వ్యవహార శైలితో ఆవేదనకు గురవుతున్నారు
 • పార్టీలు మారటం ఆవిడకి అలవాటు తర్వాత ఏ పార్టీలో ఉంటదో ఆవిడకే తెలియదు
 • పురందేశ్వరి బీజేపీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది 
 • పురందేశ్వరి మాటలు విని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు
 • సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఊసరవెల్లిలు విమర్శించడం  హాస్యాస్పదం
 • ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరు శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌లాంటి నాయకుడిని భారతదేశ చరిత్రలో చూడలేదు
 • రాష్ట్రంలో విద్య వైద్యం ఆర్థిక పరంగా ఏ కుటుంబం చితికి పోకూడదని ఆర్థిక విధానాన్ని నమ్మిన వ్యక్తి మా ముఖ్యమంత్రి
 • భీమవరంలో నాపై పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు
 • పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా దమ్ముంటే నాపై ఒంటరిగా పోటీ చేసి గెలవాలి
 • పవన్ కళ్యాణ్ మీకు భయం లేదంటే చంద్రబాబును ఒప్పించి భీమవరంలో నాపై ఇద్దరు పోటీ చేసి నాపై గెలవగలరా ఇది నా చాలెంజ్

7:40  AM, Feb 2nd, 2024

చంద్రబాబు సీట్లు అమ్ముకుంటారు: ఎంపీ కేశినేని నాని

 • ఎన్నికల తర్వాత రాష్ట్రం వదిలి పారిపోతారు
 • చంద్రబాబు ఎప్పుడూ ధనికుల కోసమే పనిచేస్తారు
 • పేదల కోసం పనిచేస్తున్న సీఎం జగన్‌...
 • జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. ఆయన వెంటే జనం 

07:35 AM, Feb 2nd, 2024

కడప గడ్డపై కపట నాటకం..

 • సూత్రధారి కుటలనీతి చంద్రబాబు
 • పాత్రధారులు:  షర్మిల, సునీత, బీటెక్‌ రవి, సీఎం రమేశ్‌ తదితరులు   
 • ఎంపీగా సునీత బరిలోకి దిగేలా షర్మిలతో బాబు రాయబారం
 •  కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత.. 
 • దీంతో వివేకా భార్య సౌభాగ్యమ్మను నిలిపే ఆలోచన
 • ఇండిపెండెంట్‌గా అయితే టీడీపీ మద్దతుంటుందని చర్చ
 • కుటుంబీకుల మద్దతు కూడా అడగవచ్చనే ఆలోచన 
 • పైగా కుటుంబీకురాలికి మద్దతు ఇవ్వలేదని జగన్‌పై బురద వేయొచ్చు
 • దీన్ని కడపలోను, రాష్ట్రవ్యాప్తంగానూ దుష్ప్రచారానికి వాడనున్న టీడీపీ
 • వివేకా హత్య వ్యవహారంలో... ఎల్లో రాతలే అందరి అస్త్రాలు
 • హంతకుడిని రక్షిస్తూ... టీడీపీతో అంటకాగుతున్న సునీత
 • తన తండ్రిని అనైతికంగా ఓడించిన బీటెక్‌ రవితోనూ సాన్నిహిత్యం
 • బీజేపీలో ఉన్న టీడీపీ నేతల నుంచీ ఆమెకు ఆర్థిక సహకారం
 • షర్మిల భర్తతో, అటు రేవంత్‌రెడ్డితో కూడా బీటెక్‌ రవి మంతనాలు
 • బాబు స్కెచ్‌ ప్రకారం కడపలో ‘కుటుంబ పోరు’ ఆవిష్కరించేందుకు కుట్ర 

07:10 AM, Feb 2nd, 2024
పేదల ఇళ్లకు హక్కులు ఓర్వలేని రామోజీ

 • పేదలపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన రామోజీ
 • ఇల్లులేని 31 లక్షల మందికి ఉచితంగా పట్టాలు ఇచ్చిన సీఎం జగన్‌
 • ఇప్పుడు వాటిని రిజిస్టర్‌ చేసి ఇస్తున్నారు.
 • అది చూడలేక కడుపు మంటతో రామోజీ తప్పుడు ప్రచారం. 

07:00 AM, Feb 2nd, 2024
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరారీ..

 • నల్లధనం కేసులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరారీ
 • తనిఖీకి వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యం.
 • ఎమ్మెల్యే ఏలూరితో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు

06:50 AM, Feb 2nd, 2024
కొవ్వూరు టీడీపీలో ముసలం

 • తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో ముసలం 
 • కేఎస్‌ జవహర్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కిన టీడీపీ కార్యకర్తలు
 • గ్రూప్‌ రాజకీయాలు ప్రొత్సహిస్తున్నాడంటూ జవహర్‌పై ఆరోపణలు
 • జవహర్‌కు కాకుండా ఎవరికి ఇచ్చినా ఓకే అంటున్న తెలుగు తమ్ముళ్లు
 • ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేసిన జవహర్‌ వ్యతిరేక వర్గం
 • వేరే ఎవరికి ఇచ్చినా సమిష్టిగా గెలిపించుకునే ప్రయత్నం చేస్తామంటూ ప్రకటన
 • లేకుంటే.. పరిణామాలు మరోలా ఉంటాయని అధినేత చంద్రబాబుకి సంకేతాలు పంపిన కేడర్‌

06:45 AM, Feb 2nd, 2024
ఇంతకీ పోటీ ఎక్కడ పవనూ?

 • ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌!
 • పోటీ ఎక్కడి నుంచి అనేదానిపై లేని క్లారిటీ
 • జనసేనాని పోటీ ఎక్కడి నుంచో అని జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ
 • గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పవన్‌ పోటీ
 • రెండింటిలోనూ ఓడిన పవన్‌ కల్యాణ్‌
 • గాజువాక, భీమవరంలలో ఓడిపోవడానికి టీడీపే కారణమంటూ అప్పట్లో మండిపడ్డ జనసైనికులు
 • పొత్తు వంకతో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్న టీడీపీ
 • పొత్తు ధర్మం పక్కనపెట్టినందుకు కౌంటర్‌ రియాక్షన్‌ ఇవ్వాలంటూ పవన్‌పై ఒత్తిడి
 • ఈ క్రమంలోనే రెండు స్థానాల ప్రకటన
 • అయినా లెక్క చేయని టీడీపీ అధినేత చంద్రబాబు

6:30 AM, Feb 2nd, 2024
తెలుగుదేశం.. గందరగోళం

 • టీడీపీ అధిష్టానంలో గందరగోళ పరిస్థితి
 • సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఎడతెగని కసరత్తులు
 • నిన్నంతా హైదరాబాద్ చంద్రబాబు చర్చలు
 • నియోజకవర్గాల నేతలు, ఆశావహులకు ఏం చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు
 • క్షేత్రస్థాయిలో దిగజారుతున్న పరిస్థితి
 • పొత్తుల కత్తెరలో ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు
 • ఏదో ఒకటి తేల్చాలని జనసేన నుంచి ఒత్తిడి
 • ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడ చోట్ల పోటీ చేయాలి?
 • తొందరపడి ఇటీవల రెండు సీట్లు ప్రకటించిన చంద్రబాబు
 • పోటీగా తాను రెండు ప్రకటించిన పవన్‌ కళ్యాన్‌
 • రేపు చంద్రబాబు 50 ప్రకటిస్తే.. పవన్‌ కూడా 50 సీట్లు ప్రకటిస్తాడా?
 • ఎన్నికలు సమీపిస్తున్నా.. కసరత్తు చివరి దశకు రాదా?
 • మ్యానిఫెస్టో అటకెక్కినట్టేనా?
 • సీట్లపై పీఠముడి వీడేదెప్పుడు?
 • ఎంపీ స్థానాల విషయంలోనూ ఇదే సందిగ్ధతా?
 • ఇప్పుడు YSRCP ఎమ్మెల్యేలవైపు చూపులెందుకు?
 • క్యాడర్‌కు ఎన్నాళ్లు వెన్నుపోటు పొడుస్తారు?

Advertisement
 
Advertisement