March 2nd : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On March 2nd In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Mar 2nd: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Sat, Mar 2 2024 7:28 AM | Last Updated on Sat, Mar 2 2024 7:23 PM

Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 2nd Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

7:21 PM, Mar 2nd, 2024
మూడు సిద్ధం సభలు చూసి టీడీపీ-జనసేన చల్లబడ్డాయి: మంత్రి అంబటి రాంబాబు

 • జగన్‌ను ఎదిరించగలిగే స్థాయిలో జెండా సభ లేదు
 • రెండు పార్టీలు కలిసినా వైసీపీని ఎదిరించలేవు
 • ఇక ఈనెల 10న నాలుగో సభతో విపక్షాల రాజకీయానికి ముగింపే
 • చంద్రబాబును సీఎం చెయ్యడం కాపులకు ఇష్టం లేదు
 • పవన్ కల్యాణ్ అయితే కాస్తోకూస్తో ఆలోచిద్దామనుకున్నారు
 • టీడీపీ-జనసేన పొత్తుతో కాపుల్లో నిరాశ అలుముకుంది
 • సీఎంగా జగన్ అయితేనే మంచిదని కాపుల్లో నమ్మకం వచ్చింది
 • అందుకు నిదర్శనమే వైసీపీలో చేగొండి సూర్యప్రకాష్ చేరిక
   

7:20 PM, Mar 2nd, 2024
విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తా : విష్ణుకుమార్ రాజు

 • 2014 ఎన్నికల్లో టీడీపీ
 • జనసేన పొత్తుతో విశాఖ నార్త్ నుంచి గెలిచా
 • మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నా 
 • పొత్తులపై తుది నిర్ణయం అధిష్ఠానానిదే
 • ఈ సమావేశం ప్రీ ఫైనల్ లాంటిది
 • క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏంటనే దానిపై చర్చ
 • అభ్యర్థుల బలాబలాలపై సమావేశంలో చర్చిస్తున్నాం

7:16 PM, Mar 2nd, 2024
ముద్రగడ, హరిరామ జోగయ్యపై జనసేన నేతల ఫైర్

 • పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారని జనసేన ఆగ్రహం
 • పవన్ కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదు?
 • 30 ఏళ్ళ క్రితం కాపులు వేరు.. ప్రస్తుతం కాపులు వేరు
 • కన్న కొడుకులకి సలహాలు ఇవ్వలేరు.. పవన్ కు లేఖలు రాస్తారా?
 • పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: కిరణ్ రాయల్

7:15 PM, Mar 2nd, 2024
పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుంది : ఆదినారాయణరెడ్డి

 • పొత్తులతో వెళ్దామన్నా సిద్ధం...ఒంటరిగా అయినా పోటీకి సిద్ధం
 • టీడీపీ-జనసేన 99 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాయి
 • ఇంకా ప్రకటించని స్థానాలు చాలా ఉన్నాయి
 • జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని చెప్పా

7:14 PM, Mar 2nd, 2024
ఎన్నికలకు ముందే నాపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓటమి అంగీకరించారు: మంత్రి వేణు

 • రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం
 • గెలిచిన తర్వాత గోరంట్ల అమెరికా వెళ్లిపోయారు.. ప్రజలకు అందుబాటులో లేరు
 • ఇసుక దోపిడీకి పాల్పడింది టీడీపీ పార్టీ నేతలే
 • నాపై ఇసుక దోపిడీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది
 • ప్రతిపక్ష పార్టీలకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమి తెలుసు

7:12 PM, Mar 2nd, 2024
రెండు వరుస లేఖలు విడుదల చేసిన హరిరామ జోగయ్య

 • గతంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేయకుంటే బాగుండేది
 • రాజకీయ అనుభవం లేని ఇద్దరి నేతల సలహాలతోనే పవన్ కల్యాణ్ ఓడిపోయి ఉండవచ్చు
 • భీమవరం-పిఠాపురంలో పవన్ పోటీ పై విశ్లేషించిన జోగయ్య 

7:10 PM, Mar 2nd, 2024
విజయవాడ : కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం 

 • ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు 1,361 అప్లికేషన్స్
 • ప్రతి చోటా ఆశావహుల వివరాలు కమిటీకి అందజేశాం
 • గెలుపు అవకాశాలు, పార్టీకి చేసిన సేవలు, నిజాయితీని బట్టి టికెట్ ఇస్తాం
 • ఈనెల 5, 6 వ తేదీల్లో ఆశావహులతో మళ్లీ సమావేశం ఉంటుంది : గిడుగు రుద్రరాజు

6:18 PM, Mar 2nd, 2024
చింతలపూడి నియోజకవర్గం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ బేధాలు

 • జంగారెడ్డిగూడెం టౌన్ హాలులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చింతల పూడి టీడీపీ ఇన్‌ఛార్జ్  సొంగారోషన్  కుమార్
 • సొంగరోషన్ కుమార్ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టిన పట్టణ సీనియర్ నాయకులు
 • సమావేశంలో ఇంచార్జ్ సొంగరోషన్‌ను  పక్కనపెట్టి ఇతర నాయకులు మాట్లాడటంపై మీడియా ముందే మండిపడ్డ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు
 • పార్టీ సమావేశాలలో బయటపడుతున్న వర్గ విబేధాలతో టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన
 • కనీసం సమావేశంపై తమకు సమాచారం కూడా అందడం లేదంటున్న నాయకులు కార్యకర్తలు
 • ఇదే విధంగా విబేధాలు కొనసాగితే చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ గెలుపుపై ఆశలు ఆవిరే అంటున్న సీనియర్ నేతలు

4:19 PM, Mar 2nd, 2024
టీడీపీకి పెనమలూరులో అభ్యర్థులు కరవు: మంత్రి జోగి రమేష్‌

 • వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి జోగి రమేష్.
 • ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్
 • టీడీపీకి పెనమలూరులో అభ్యర్థులు కరువయ్యారు.
 • చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వేలు చేయిస్తున్నాడు
 • చంద్రబాబుపై పోటీ చేయడానికి పెనమలూరు వచ్చా
 • బంపర్ మెజారిటీతో గెలిచి సీఎం జగన్‌కి బహుమతిగా ఇస్తా
 • ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

2:56 PM, Mar 2nd, 2024
పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడు: మంత్రి అంబటి రాంబాబు

 • సినిమా డైలాగులు చెప్పడానికే పవన్‌ పనికొస్తాడు
 • చంద్రబాబుకు కాపులు మద్దతు ఇవ్వరు
 • నాలుగో సిద్ధం సభతో టీడీపీ మూతపడటం ఖాయం

2:40 PM, Mar 2nd, 2024
ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు

 • అనర్హత పిటిషన్‌పై నోటీసులు జారీ చేసిన శాసన మండలి ఛైర్మన్‌
 • ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు
 • ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని నోటీసులు
   

2:00 PM, Mar 2nd, 2024
పవన్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్‌ కౌంటర్‌

 • పవన్‌.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ తిరిగావ్‌..
 • 24 సీట్లకు నిన్ను ఎవరు ఆపారు పవన్‌?.
 • చంద్రబాబు ఆపాడా?.. ప్యాకేజీ ఆపింది?.. ఏం ఆపిందో ప్రజలకు చెప్పు. 
 • 175 సీట్లలో ముష్టి 24 సీట్లులో జనసేన పోటీ చేయడం సిగ్గుచేటు. 

1:30 PM, Mar 2nd, 2024
చంద్రబాబుకు కేశినేని నాని కౌంటర్‌

 • సీఎం జగన్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
 • సామాజిక న్యాయ విధాత సీఎం జగన్ 
 • చంద్రబాబు పోకడలతో విసిగిపోయి ముఖ్యమంత్రి జగన్ వెంట నడుస్తున్నాను 
 • గ్రామాల్లోకి వెళ్తుంటే ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు ద్వారా మారిన స్కూల్స్ కనిపిస్తున్నాయి 
 • మానవ అభివృద్దే అసలైన అభివృద్ధి 
 • పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం భారతదేశ చరిత్రలోనే ఒక అధ్యాయం 
 • చంద్రబాబు ఒక్క బీసీని రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే పెట్టారు 
 • జగన్ బీసీని మైలవరం ఎమ్మెల్యే, ఏలూరు, నర్సరావుపేట ఎంపీలుగా బీసీలకు టికెట్స్ ఇచ్చిన రిఫార్మర్
 • రాష్ట్రవ్యాప్తంగా వందలమంది బీసీలకు రాజకీయంగా పదవులు ఇచ్చారు 
 • బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు లేదు 
 • మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్‌పై బీసీ అభ్యర్థి 15వేల మెజారిటీతో గెలుస్తాడు

1:00 PM, Mar 2nd, 2024
బాపట్ల సిద్ధం సభలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో

 • వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు రంగం సిద్దమైంది.
 • ఈనెల పదో తేదీన బాపట్లలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల
 • వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం జగన్‌
 • సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. 
 • విజయసాయి కామెంట్స్‌..
 • సిద్ధం సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తాం. 
 • గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్‌ వివరిస్తారు. 
 • ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. 
 • సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. 
 • ఒక దానిని మించి ఇంకో సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు.
 • వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్‌సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. 
 • బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. 
 • సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. 
 • మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. 

12:40 PM, Mar 2nd, 2024
నేను పోటీ నుంచి తప్పుకుంటున్నా: మహాసేన రాజేష్ 

 • పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్‌కు టికెట్ ఇచ్చిన అధిష్టానం 
 • పోటీ చేయలేనని తప్పుకుంటున్నాంటున్న మహాసేన రాజేష్‌
   

12:10 PM, Mar 2nd, 2024
జెండా పీకేసిన నాగబాబు..

 • అనకాపల్లిలో జెండా పీకేసిన నాగబాబు.
 • అనకాపల్లి ఎంపీగా పోటీ అంటూ ఆర్భాటం.
 • అచ్చుతాపురంలో ఇల్లు తీసుకుని నాలుగు రోజులు హడావిడి.
 • సమీక్షల పేరుతో ఆర్భాటం.
 • సర్వేలతో నాగబాబుకు మొదలైన ఓటమి భయం.
 • అనకాపల్లి నుండి హైదరాబాద్‌కు మకాం మార్చిన నాగబాబు.
 • ముటాముల్లే సర్దుకుని హైదరాబాద్‌కు పయనం.

11:40 AM, Mar 2nd, 2024
బోండా ఉమకు వెల్లంపల్లి శ్రీనివాస్‌ కౌంటర్‌

 • పేదలకు ఇచ్చే ఇళ్లను బోండా ఉమా అడ్డుకున్నాడు.
 • చంద్రబాబుకు టీడీపీ నేతలకు ప్రజలకు ఎప్పుడూ మంచి చేసే ఉద్దేశం లేదు.
 • సెంట్రల్ నియోజకవర్గం ప్రజలను ఓటు అడిగే హక్కు బోండా ఉమకు లేదు
 • నిన్న జరిగిన మీటింగ్‌లో బోండా ఉమ మైనారిటీల్ని అవమానపరిచాడు.
 • మైనార్టీల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు.
 • మైనార్టీల మీద దేశద్రోహం కేసులు పెట్టింది చంద్రబాబే
 • నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మీటింగ్ పెట్టి అందరిని బెదిరిస్తున్నాడు బోండా ఉమా.
 • చంద్రబాబు, నువ్వూ ఇద్దరూ ఓడిపోతున్నారు.
 • ప్రజలను బెదిరిస్తే బోండా ఉమకు మర్యాద దక్కదు.
 • బోండా ఉమా ఓటమి తథ్యం.
 • సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తాం.

11:15 AM, Mar 2nd, 2024
టీడీపీలో పీక్‌ స్టేజ్‌కు టికెట్‌ పోరు..

 • మైలవరం టీడీపీలో తారాస్థాయికి చేరిన టికెట్‌ పోరు  
 • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 
 • వసంత వెంట కేశినేని చిన్ని, నెట్టెం రఘురాం 
 • టీడీపీలోకి వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా, అతని అనుచరులు 
 • వసంత చేరిక సమయంలో కనిపించని దేవినేని ఉమా 
 • వసంత కృష్ణప్రసాద్‌ను పార్టీలో చేర్చుకోవద్దని గతంలోనే చంద్రబాబుకు చెప్పిన ఉమా
 • ఉమా మాటలను లైట్ తీసుకున్న చంద్రబాబు
 • నిన్న అనుచరులతో కలిసి దేవినేని ఉమా తిరుగుబాటు
 • ఎవరో వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహకరించేది లేదని తెగేసి చెప్పిన దేవినేని ఉమా, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు
 • ఉమాను కాదని మరో వ్యక్తికి మైలవరం టిక్కెట్ కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన ఉమా వర్గం
 • ఉమాతో పాటు వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బొమ్మసాని సుబ్బారావు 
 • టీడీపీలోకి వసంత ఎంట్రీతో మూడు ముక్కలుగా విడిపోయిన మైలవరం టీడీపీ

10:45 AM, Mar 2nd, 2024
‘తెలుగు’ బీజేపీ నేతలకు మధుకర్‌ జీ క్లాస్‌

 • మీడియా ఫ్యానలిస్టులతో, మీడియా కమిటీ ప్రతినిధులతో బీజేపీ మధుకర్ జీ సమావేశం.
 • మీడియాలో పార్టీ తరపున ఎలా స్పందించాలో దిశా నిర్దేశం చేసిన మధుకర్‌.
 • సమావేశంలో బీజేపీ(తెలుగుదేశం) నేతలకు తలంటిన మధుకర్ జీ
 • వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు సమాన దూరం పాటించాలని హితవు.
 • ఒక వైఎస్సార్‌సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారు.
 • టీడీపీపై విమర్శలు ఎందుకు చేయడం లేదు?.
 • గతంలో టీడీపీ కూడా అధికారంలో ఉంది.
 • 70:30 శాతంలో కూడా మీరు విమర్శలు చేయడం లేదు.
 • కుటుంబ పాలనకు వ్యతిరేకం అనేది బీజేపీ విధానం.
 • పొత్తుల గురించి మీకు అప్పుడే తొందర ఎందుకు.
 • ఎప్పుడైనా పొత్తుపై నిర్ణయం తీసుకోవచ్చు. 
 • ఈ లోపల మీరు చేసే పని మీరు చేయండి.

10:00 AM, Mar 2nd, 2024
సీఎం జగన్‌కే మా ఓటు.. సామాన్యులు

 • హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు..
 • ఇంటింటికీ సంక్షేమం అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌. 
 • మా ఓటు సీఎం జగన్‌కే. 
 • ఈసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్‌ జగన్‌. 

9:30 AM, Mar 2nd, 2024
షర్మిల వల్ల చాలా నష్టపోయాం..

 • తెలంగాణలో షర్మిలను నమ్మి రాజకీయంగా, ఆర్థికంగా చాలా నష్టపోయాం.
 • మా వంటి ఎంతో మంది నాయకులకు షర్మిల మోసం చేశారు. 
 • ఆమె స్వలాభం కోసం మమ్మల్ని బలి చేశారు. 

9:00 AM, Mar 2nd, 2024
ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీలో భారీగా దరఖాస్తులు..

 • బీజేపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్ధానాలలో పోటీకి రికార్డు స్ధాయిలో దరఖాస్తులు
 • పొత్తులు లేకపోయినా పోటీకి సై అంటూ వేలాదిగా ధరఖాస్తులు చేసుకున్న బీజేపీ అభ్యర్ధులు
 • రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్ధానాలకి 3283 ధరఖాస్తులు
 • ఒక్క గుంటూరు జిల్లా నుంచే 125 మంది దరఖాస్తులు
 • 25 లోక్‌భ స్ధానాలకి 1861 దరఖాస్తులు
 • నేడు శివప్రకాష్ జీ ఆద్వర్యంలో అభ్యర్దుల ఎంపిక కసరత్తులు
 • ప్రతీ అసెంబ్లీకి ముగ్గురు, ప్రతీ లోక్‌సభకి మూడు పేర్లు చెప్పుల అభ్యర్ధుల జాబితా ఎంపిక
 • ఈ జాబితాను జాతీయ నాయకత్వానికి పంపనున్న శివప్రకాష్
 • ప్రతీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి బాధ్యతలలో ఉన్న నేతలకి పిలుపు
 • ప్రతీ పార్లమెంట్‌పై చర్చకు ఒక గంట సమయం కేటాయింపు.

8:10 AM, Mar 2nd, 2024
చంద్రబాబు, పవన్‌కు లక్ష్మీపార్వతి కౌంటర్‌..

 • చంద్రబాబు రాజకీయ సమర్ధుడైతే 23 సీట్లకే ఎందుకు పడిపోయాడు?
 • చంద్రబాబు చేసిని అవినీతి నీకు కనిపించలేదా పవన్‌?
 • జనసైనికులకు ఉన్న పౌరుషం నీకు లేదు.

7:45 AM, Mar 2nd, 2024
టీడీపీ, జనసేనకు బీజేపీ షాక్‌!

 • టీడీపీ, జనసేన అభ్యర్ధులని ఏకపక్షంగా ప్రకటించడంపై బీజేపీలో తీవ్ర అసంతృప్తి
 • ఏపీలో ఒంటరి పోరుకి సన్నద్దమవుతున్న బీజేపీ
 • అభ్యర్ధుల ఎంపిక దిశగా బీజేపీ హైకమాండ్‌ కసరత్తులు
 • నేడు, రేపు ఏపీ బీజేపీ కీలక సమావేశం
 • విజయవాడలో ముఖ్య నేతలతో సమావేశమవుతున్న బీజేపీ నేత శివప్రకాష్
 • ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు ముఖ్య నేతలకి పిలుపు
 • నేడు 12 పార్లమెంట్ నియోజకవర్గాలు, రేపు 13 పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం
 • 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు
 • ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ వారీగా అభ్యర్ధుల నుంచి ధరఖాస్తుల స్వీకరణ
 • టీడీపీ, జనసేన ఏకపక్ష ప్రకటనలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం
 • ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల జరిగిన‌ కోర్ కమిటి సమావేశాల్లోనూ అభిప్రాయపడ్డ మెజార్టీ సభ్యులు
 • ఒంటరిగా పోటీ చేస్తేనే ఏపీలో బీజేపీ ఓటు షేర్ పెరుగుతుందంటున్న నేతలు
 • ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపైనా అసంతృప్తి
 • పొత్తులపై మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశాలు
 • బీజేపీలో ఉన్న టీడీపీ నేతలపైనా అధిష్టానానికి ఫిర్యాదులు
 • తమ స్వార్ధం‌కోసమే పొత్తులు కోరుకుంటున్నారని ఫిర్యాదులు
 • వారి తీరుతో పార్టీకి నష్టమంటున్న నేతలు

7:20 AM, Mar 2nd, 2024
బాబు ఓకే చేస్తేనే పవన్‌ యాక్షన్‌..

 • జనసేన అధినేత పవన్‌ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే
 • ఆ పార్టీకి 24 సీట్లు కేటాయించినా, ఇప్పటివరకు ఐదు మాత్రమే ఖరారు
 • బాబు అభ్యంతరాలతో పవన్‌ పోటీచేసే నియోజకవర్గం పెండింగే
 • రాజోలు, తణుకు, రాజమండ్రి రూరల్‌ కూడా.. 
 • ఎన్నికల వేళ హైదరాబాద్‌లో మకాం ఏమిటని పార్టీ శ్రేణుల ప్రశ్న

7:00 AM, Mar 2nd, 2024
చంద్రబాబు, మహాసేన రాజేష్‌కు ధన్యవాదాలతో.. ఇట్లు నర్రెడ్డి సునీత

 • సునీత ఢిల్లీ ప్రెస్‌మీట్‌తో తొలగిన ముసుగు
 • వివేకా హత్య వెనుక ఉన్నది ఎల్లో గ్యాంగే
 • మెజార్టీ ఉన్నా వివేకాను ఎమ్మెల్సీఎన్నికల్లో ఓడించిన పచ్చ ముఠా
 • వివేకా ఉంటే జిల్లాలో రాజకీయమనుగడ ఉండదని టీడీపీ భయం
 • వివేకా రెండో వివాహంతోనేఆ కుటుంబంలో విభేదాలు
 • వివేకా మృతితో సునీత కుటుంబానికే ఆర్థికంగా లబ్ధి
 • వివేకా లేఖను రహస్యంగా ఉంచడం వెనుక ఉద్దేశమూ నిజాలు బయటకు రాకూడదనే
 • గుండెపోటుతో వివేకా మరణించినట్లు చేసిన ప్రచారమూ వారిదే
 • వివేకా రెండో వివాహం...కుటుంబ విభేదాలు కప్పిపుచ్చడం ఎందుకో!
 • తండ్రి హంతకులు, కుట్రదారులనే వెనకేసుకొచ్చిన సునీత
 • వారితో కొంతకాలంగా సునీతదంపతుల సాన్నిహిత్యం
 • చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా
 • వైఎస్సార్‌సీపీకి ఓటేయద్దంటూ అసలు స్వరూపం బయటపెట్టుకున్న సునీత

6:50 AM, Mar 2nd, 2024
వైఎస్సార్‌సీపీ తొమ్మిదో జాబితా విడుదల

 • నెల్లూరు ఎంపీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి
 • కర్నూలు అసెంబ్లీ సమన్వయ కర్తగా ఎండీ ఇంతియాజ్
 • మంగళగిరి సమన్వయకర్తగా మురుగుడు లావణ్య.
 • ఇప్పటిదాకా 9 జాబితాల్లో.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయకర్తల నియామకం/మార్పులు
 • సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటముల్నే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక
 • ఎన్నికల కోసం దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లేనని ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం జగన్‌ 

6:40 AM, Mar 2nd, 2024
ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ రెడీ?

 • 50 అసెంబ్లీ సీట్లు, 11 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసుకున్న బీజేపీ 
 • అభ్యర్థుల జాబితాను అధిష్టానం పెద్దలకు అందజేసిన ఏపీ బీజేపీ
 • టీడీపీ- జనసేన ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై అసంతృప్తి 
 • తమకు పట్టున్న స్థానాలలోనూ అభ్యర్థులను ప్రకటించడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు 
 • రేపు 175 స్థానాలలో అభ్యర్థులు ఎంపికపై చర్చించనున్న బీజేపీ

6:30 AM, Mar 2nd, 2024
జనసేనకు భారీ షాక్‌

 • ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిక
 • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్న సూర్యప్రకాష్‌
 •  జనసేనాని తీరును ఎండగట్టిన సూర్య ప్రకాష్‌
 • పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయలేరా?
 • ఆరేళ్లలో అరగంట మాత్రమే తనతో పవన్‌ మాట్లాడారు
 • పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు
 • సామాజిక న్యాయం గురించి పవన్‌కు ఏమాత్రం తెలియదు
 • జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు
 • సలహాలు ఇచ్చేవారిని వైఎస్సార్‌సీపీ కోవర్టులంటూ పవన్‌ బహిరంగంగా అన్నారు
 • ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్‌కే క్లారిటీ లేదు
 • మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక.. ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని.. పదవికి రాజీనామా ఈ  ఉదయమే పంపించా
 • బేషరతుగా వైఎస్సార్‌సీపీలో చేరా
 • క్రమశిక్షణ గల నేతగా వైఎస్సార్‌సీపీ కోసం పని చేస్తా
 • ఇక నుంచి నా ప్రయాణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే
 • పవన్ కల్యాణ్‌ని నమ్మి గతంలో  జనసేనలో చేరాను
 • పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా
 • ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు
 • పైకి కనిపించే పవన్ వేరు.. తెర వెనుక వేరే
 • ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికి అరగంట మాత్రమే నాతో మాట్లాడారు
 • నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు
 • చంద్రబాబునో, లోకేష్‌నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు
 • అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు
 • పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు
 • ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు
 • సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలపడాలి
 • పిఏసీ సభ్యులుగా ఉన్నా కూడా స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
 • నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు
 • ఎవరైనా ప్రశ్నిస్తే మీరంతా వైసీపీ కోవర్టులు అంటూ ముద్ర వేస్తున్నారు
 • ఏం ఆశించి జనసేన పెట్టారో అర్థం కావటం లేదు
 • ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను
 • జగన్ గట్స్ ఉన్న లీడర్‌, అలాంటి నాయకుని వెంట నడవాలని అనుకుంటున్నా
 • ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను
 • సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా
 • ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది
 • అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు
 • టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు?
 • ఏం లబ్ది చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు?
 • వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement