
సాక్షి, పోలవరం: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా పోలవరం నిర్మాణ పనులపై మంత్రి అంబటి ఆరా తీశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్దంగా పనులు చేపట్టింది. గత ప్రభుత్వం పోలవరం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయింది? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైంది. పోలవరం ప్రాజెక్ట్‌పై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది అని సీరియస్ అయ్యారు.
ఇది కూడా చదవండి: ‘పవన్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో’