‘అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే’ | Ambati Rambabu Fires On Chandrababu And Vangalapudi Anitha | Sakshi
Sakshi News home page

‘అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే’

Apr 9 2025 6:29 PM | Updated on Apr 9 2025 7:14 PM

Ambati Rambabu Fires On Chandrababu And Vangalapudi Anitha

సాక్షి, తాడేపల్లి: రామగిరిలో ఎంపీపీ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందని  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతల నుంచే కాదు.. పోలీసుల నుంచి మా ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడాల్సిన పోలీసులు.. టీడీపీకి కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు.

‘‘పోలీసుల అండతో టీడీపీ నేతలు స్థానిక ఎన్నికలను వాయిదా పడేలా చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారు. ఎన్నో మోసాలు చేసిన చంద్రబాబు పెద్ద చీటర్‌. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీశ్రేణులు గ్రామాలకు గ్రామాలే వదిలి వెళ్లిపోయారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎస్‌ఐని కూడా ట్రాన్స్‌ఫర్‌ చేయలేని అనిత మీడియా ముందు అవాకులు, చవాకులు పేలుతున్నారు’’ అంటూ అంబటి  రాంబాబు ధ్వజమెత్తారు.

‘‘రామగిరిలో గత నెల 27న ఎంపీపీ ఎన్నిక జరగాలి. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9 వైఎస్సార్‌సీపీ, 1 టీడీపీ గెలిచింది. ఒక్క ఎంపీటీసీతో ఎలా ఎన్నికకు వెళ్థామనుకున్నారో అర్థం కాలేదు. ఎన్నిక నేపథ్యంలో ఇద్దరు ఎంపీటీసీలను టీడీపీ లాగేసుకుంది. మిగిలిన ఆరుగురుని గద్దల్లా తన్నుకుపోకుండా మేం కాపాడుకున్నాం. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు భద్రత కల్పించమని కోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్య యుతంగా గెలిచిన మా ఎంపీటీసీలను పోలీసులు, అధికారుల నుంచి కాపాడుకోవాల్సి వచ్చింది

..30వ తేదీన లింగమయ్యను అతిదారుణంగా హతమార్చారు. ఇంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. అన్ని ప్రలోభాలకు గురిచేసినా అత్తిలిలోనూ మా బలం 13 మంది. ఎన్నికకు వెళ్లకుండా మా నాయకులు కారుమూరి నాగేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు ట్రాక్టర్లతో ముట్టడించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే టీడీపీ నేతలే క్రిమినల్స్. ఇచ్చిన హామీలను అమలు చేయలేని పెద్ద చీటర్ చంద్రబాబు. 2024 ఎన్నికల తర్వాత పల్నాడులో గ్రామాలను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది

..హోంమంత్రి అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే. అనిత ఎస్ఐను కూడా ట్రాన్స్‌ఫర్ చేయించలేరు. మా నేతలను బెదిరించి.. భయపెట్టేవారికి పోస్టింగ్‌లు ఉంటాయి. నేనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. ఎందుకు కేసులు నమోదు చేయరని అడిగితే నాపైనే కేసు పెట్టారు. నేను కోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు నా ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తున్నారు. కచ్చితంగా మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. చట్టానికి వ్యతిరేకంగా ఓ వర్గానికి కొమ్ముకాస్తున్న వారిని కచ్చితంగా బట్టలిప్పి నుంచోబెడతాం

జగన్ భద్రతపై అనిత వ్యాఖ్యలకు అంబటి దిమ్మదిరిగే కౌంటర్

..పోలీసులు సంఘవిద్రోహ శక్తులు అన్నది చంద్రబాబు కాదా. 1100 మంది పోలీసులను పెట్టామని హోంమంత్రి చెబుతున్నారు. ఏం చేయడానికి వచ్చారు అంతమంది అని ప్రశ్నిస్తున్నా. పలు మార్లు కోర్టులు అక్షింతలు వేసినందుకు డిఫ్యాక్ట్ హోం మంత్రి నారా లోకేష్ సిగ్గుపడాలి. చంద్రబాబు, లోకేష్‌కు జనం ఎగబడరు. కానీ జగన్ రోడ్డు మీదకు వస్తే వేలాది మంది వస్తారు. వేలాది మంది హెలీకాప్టర్ వద్దకు వస్తే పోలీసులు ఏం భద్రత కల్పించారు?

..జగన్ ఇప్పటికి.. ఎప్పటికీ పులివెందుల ఎమ్మెల్యే. ఒక మాజీ సీఎం కుమారుడు.. మాజీ సీఎంగా చేసిన వ్యక్తి జగన్. అసాధారణమైన ప్రజాదరణ కలిగి గొప్ప నాయకుడు జగన్. అమ్మా హోంమంత్రి.. జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ నువ్వు, లోకేష్ ఇచ్చింది కాదు. ఆయనకు హక్కుగా వచ్చింది జడ్ ప్లస్ సెక్యూరిటీ. భద్రత ఇవ్వడం మీకు చేతకాకపోతే...ఇవ్వలేమని చెప్పండి. గుంటూరు మిర్చియాడ్‌కు వెళ్తుంటే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సెక్యూరిటీని తొలగించారు. సెక్యూరిటీ ఇవ్వకుండా జగన్‌కు ఏమైనా జరిగితే ఆనందపడాలని మీ ఆలోచన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

..ఎన్నాళ్లు మీ అరాచకాలను సహించాలి. మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?. ఐపీఎస్ అధికారులు స్ట్రిక్ట్‌గా ఉండకపోతే శాంతి భద్రతలు లోపిస్తాయి. వైఎస్‌ జగన్‌కి సెక్యూరిటీ కోసం మేం సైన్యాన్ని తయారు చేసుకోవాలా?. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగానే భద్రత కల్పించడం లేదనే అనుమానాలున్నాయి. దయచేసి అక్రమాలు, అన్యాయాలకు మార్గాలు వేయకండి. ఎవరైతే చట్టప్రకారం వ్యవహరించరో.. టీడీపీకి కొమ్ముకాస్తారో... వారిని చట్టం ముందు యూనిఫాం విప్పి నిలబెడతాం. ఎంపీపీ ఎన్నిక కోసం నిండుప్రాణాన్ని తీసేస్తారా?. చంద్రబాబు, లోకేష్ మాటలు విని కావాలనే కుట్ర చేస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని అంబటి రాంబాబు  హెచ్చరించారు.
 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement