ఏపీ కొత్త మంత్రులు - వారికి కేటాయించిన శాఖలు ఇవే | CM Chandrababu Naidu Allotted Portfolios To 24 Ministers In The Andhra Pradesh Cabinet | Sakshi
Sakshi News home page

ఏపీ కొత్త మంత్రులు - వారికి కేటాయించిన శాఖలు ఇవే

Published Fri, Jun 14 2024 2:20 PM | Last Updated on Fri, Jun 14 2024 3:07 PM

Allotment Of Departments To Ap Ministers

సాక్షి, అమరావతి: ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెర పడింది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే  పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రిత్వ శాఖలు దక్కాయి. పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి & తాగునీటి సరఫరా శాఖలను ఆయనకే ఇచ్చారు. అలాగే.. పర్యావరణ, అటవీశాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కూడా పవన్‌కే దక్కాయి. సాధారణ పరిపాలన, శాంతిభదత్రల శాఖలను చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు.

మిగతా వాళ్లలో మంత్రుల శాఖల వివరాలివే..

 • వంగలపూడి అనిత-హోంశాఖ
 • నారా లోకేష్‌- మానవ వనరులు,ఐటీ కమ్యూనికేషన్స్‌
 • ఆనం రాంనారాయణరెడ్డి-దేవాదాయ శాఖ
 • నిమ్మల రామానాయుడు- జల వనరుల శాఖ
 • నాదెండ్ల మనోహర్‌- పౌర సరఫరాల శాఖ
 • పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి శాఖ
 • కింజరాపు అచ్చెన్నాయుడు- వ్యవసాయశాఖ
 • డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమ శాఖ
 • ఎన్‌ఎండీ ఫరూక్‌- మైనార్టీ వెల్ఫేర్‌, న్యాయ శాఖ
 • కొలుసు పార్థసారధి-హౌసింగ్‌, సమాచార శాఖ
 • గొట్టిపాటి రవికుమార్‌- విద్యుత్‌శాఖ
 • పయ్యావుల కేశవ్‌- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు
 • కందుల దుర్గేష్‌- పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ
 • వాసంశెట్టి సుభాష్‌-కార్మిక శాఖ
 • అనగాని సత్యప్రసాద్‌-రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
 • మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి- రవాణా, యువజన,క్రీడల శాఖ
 • టీజీ భరత్‌- పరిశ్రమలు, వాణిజ్యశాఖ
 • సత్యకుమార్‌- వైద్య, ఆరోగ్యశాఖ
 • కొల్లు రవీంద్ర-ఎక్సైజ్‌, గనుల శాఖ
 • బీసీ జనార్థన్‌రెడ్డి- రోడ్లు, భవనాలు, లిక వసతులు, పెట్టుబడుల శాఖ
 • గుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన శాఖ
 • ఎస్‌.సవిత- బీసీ సంక్షేమం, చేనేత, ఔళి శాఖ
 • కొండపల్లి శ్రీనివాస్‌- ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు

   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement