దేశ సంపదను కాపాడేందుకు ఉద్యమం

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న మోదీ
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్
యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న పరిస్థితుల్లో దేశ సంపదను కాపా డుకునేందుకు ఉద్యమాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్ పక్రటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో కార్మికులు, ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
నరేంద్రమోదీ కార్మిక సంఘాలను నిర్వీ ర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కార్మికులు, ప్రజలు నష్టపోతుంటే అదానీ, అంబానీలు రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. నల్లధనాన్ని బయటకు తీసుకువస్తానని చెప్పిన మోదీ.. ఆ నల్లధనం కలిగిన వారిని విదేశాలకు పంపించారని ఆరోపించారు. మోదీ ఆర్‌ఎస్‌ఎస్ గొడుగు కింద పని చేస్తున్నారని విమర్శించారు.
ఆర్‌ఎస్‌ఎస్ గతంలో బ్రిటిష్ వారికి సేవ చేసిందని, నేడు పెట్టుబడి దా రులకు వత్తాసు పలుకుతోందని ఆమె మండిపడ్డారు. కేంద్రం ట్రేడ్ యూనియన్లను పట్టించుకోవడం లేదని, అపాయింట్‌మెంట్ కోరితే సమయం కూడా ఇవ్వడం లేదని అమర్‌జిత్‌కౌర్ నిందించారు. కార్మికుల సమ స్యలపై చర్చిద్దామని పిలిచి కేవలం 3 నిమిషాలు మా త్రమే సమయమిచ్చి అవమానపరుస్తున్నారని విమ ర్శించారు. దేశ సంపదను అమ్మినా, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయాలని చూసినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలరాజు, వీఎస్ బోస్, తదితరులు పాల్గొన్నారు.