అధిర్‌ రంజన్‌ చౌదరి రాజీనామా | Adhir Ranjan Chowdhury Resigns | Sakshi
Sakshi News home page

వెస్ట్‌బెంగాల్‌ పీసీసీ పదవికి అధిర్‌ రంజన్‌ రాజీనామా

Jun 21 2024 8:05 PM | Updated on Jun 21 2024 8:27 PM

Adhir Ranjan Chowdhury Resigns

కోల్‌కతా: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అధిర్‌ రంజన్‌ ఛౌదరి తన పదవికి శుక్రవారం(జూన్‌21) రాజీనామా చేశారు.

పార్టీ పేలవ ప్రదర్శనకు గల కారణాలపై పీసీసీ భేటీలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధిర్‌ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. 

బహరంపుర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 5సార్లు గెలుపొందిన అధిర్‌ లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన బెంగాల్‌లో ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తుపైనా పార్టీ అధిష్ఠానంతో విభేదించారు. 

అధీర్‌ తీరు రాష్ట్రంలో అధికార తృణమూల్‌-కాంగ్రెస్‌ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు కారణమైందనే వాదన ఉంది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకే ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ పరిమితమైంది. అదీర్‌ రాజీనామాతో మాల్దా-దక్షిణ్‌ నుంచి గెలుపొందిన ఇషాఖాన్‌ చౌధరికి రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement