'అలా మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారు'

Bandi Sanjay Kumar Slams TRS And AIMIM At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హిందు ధర్మం కోసం మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సీఎం కేసీఆర్ స్వార్ధం కోసం యాగాలు చేస్తున్నారు. గోమాతను వధించే పార్టీ ఎంఐఎం. తెలంగాణను వ్యతిరేకంచిన పార్టీ ఎంఐఎం. అలాంటి పార్టీతో కేసీఆర్‌ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. హిందువులు వారానికి ఒక్క పండుగ చేసుకుంటే ఎంఐఎం నేతలకు ఇబ్బంది ఎందుకు అంటూ ప్రశ్నించారు.

ఈ మేరకు బండి సంజయ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దేశద్రోహులకు, దేశ భక్తులకు జరిగేవి. ఎంఐఎంను, టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించాలి. హైదరాబాద్‌లో కేసీఆర్‌ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కేంద్ర నిధులు లేనిది ఏ అభివృద్ధి లేదు. కేంద్రం 2 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఒక్క ఇల్లు కూడా కేసీఆర్‌ కట్టించలేదు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్‌ కనీసం బయటకు రాలేదు. కోవిడ్‌కు ఉచిత వైద్యం అందిస్తాం. ఉచితంగా కోవిడ్‌ టెస్టులు చేస్తాం.   చదవండి: (మజ్లిస్‌ రూటే సపరేటు..!)

లక్ష ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్‌ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఓటును ఆయుధంగా ఉపయోగించుకొని టీఆర్‌ఎస్‌, ఎంఐఎంకు బుద్ది చెప్పాలి. సీఎం రాసిన స్క్రిప్ట్‌ను డీజీపీ చదువుతున్నారు. విధ్వంసాలు జరుగుతాయి అనే సమాచారం ఉందని చెప్పిన సీఎం, డీజీపీ వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు. సీఎం భయానక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ఓటర్లను బయటకు రాకుండా చూడాలని అనుకుంటున్నారు. సీఎం విద్వేషాలను రెచ్చగొట్టాలనే కుట్ర చేస్తున్నారు అంటూ బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top