పెరుగుతున్న హత్యలు.. సర్వత్రా ఆందోళన ఆస్తి, భూ వివాదాలు, పాత కక్షలే ప్రధాన కారణం కుటుంబ కలహాలు.. వివాహేతర సంబంధాలతోనూ.. ఆగని ప్రేమ వ్యవహారాలు.. జిల్లాలో పరువు హత్యలు
ఏప్రిల్ 21న:
ఫిబ్రవరి 21న:
మే 13న:
నవంబర్ 22న:
సెప్టెంబర్‌లో:
ఏప్రిల్ 30న:
సాక్షి, పెద్దపల్లి: చిన్న వివాదం.. క్షణికావేశం.. ఆ స్తిపై ఆశ.. పాత కక్షలు.. వివాహేతర సంబంధాలు.. ప్రేమ వ్యవహారాలు.. వెరసి మనిషి ప్రాణాలు తీస్తున్నాయి. ఒకప్పుడు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన సమస్యలను పెద్దలు, బంధువుల సమక్షంలో పరిష్కరించుకునేవారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చిన్న గొడవలకే కత్తులు, గొడ్డళ్లు చేతబట్టి దాడులకు దిగుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో చోటుచేసుకున్న వరుస హత్యలు నేరాల తీవ్రత, మారుతున్న నేర స్వభావాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఆస్తి, వివాహేతర సంబంధాలే
హత్యలు, హత్యాయత్నాలను పరిశీలిస్తే భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలపై అనుమానాలు, పరువు ప్రతిష్టలు, కుటుంబ కలహాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గజం భూమి కోసం సొంత కుటుంబ సభ్యులనే హతమార్చేందుకు వెనుకాడని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు.. వివాహేతర సంబంధాలు బయటపడతాయనే భయంతోనో, అనుమానాలతోనో దాడులకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వివాదాలు, సుపారీ హత్యలు కూడా నేరాల తీవ్రతను పెంచుతున్నాయి.
చిన్న కారణాలే.. తీరని విషాదాలు
భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న విభేదాలు కొన్నిసార్లు హత్యలకు దారితీస్తున్నాయి. కలిసి జీవించాల్సిన వారే కక్ష పెంచుకుని దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలుగా మారుతుండగా, నిందితులు జైలు జీవితం గడపాల్సి వస్తోంది.


