నేడు నృసింహుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేడు నృసింహుని కల్యాణం

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

పెద్దపల్లిరూర ల్‌: దేవునిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల య బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కా ర్తీక పౌర్ణమీ సందర్భంగా మంగళవారం స్వామివారి కల్యాణం జరిపిస్తా మని ఈవో శంకరయ్య వీడీసీ చైర్మన్‌ బొక్కల సంతోష్‌, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీకాంత్‌ ఆచార్యులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జి ల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈనెల 29న జరగనున్న స్వామి వారి రథోత్సవానికి లక్షలాధిగా తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వారు వివరించారు.

‘ఇందిరమ్మ’తో భరోసా

కోల్‌సిటీ: సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కు టుంబం ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడకుండా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అండగా నిలుస్తుందని రామగుండం మేయర్‌ మహంకా ళి స్వామి అన్నారు. ఇందిరానగర్‌లో ప్రచార పోస్టర్‌ను కమిషనర్‌ అరుణశ్రీతో కలిసి సోమ వారం ఆవిష్కరించారు. పథకం కింద నామినీ కి రూ.5 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుందని తె లిపారు. కమిషనర్‌ అరుణశ్రీ మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్ర చారం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్మా ర్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించినట్లు తహశీల్దార్‌ రవీందర్‌ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఏసీపీ నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సాగర్‌ పాల్గొన్నారు. అనంతరం 47వ డివిజన్‌ బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మేయర్‌ ప్రారంభించారు. కార్పొరేటర్‌ దాసరి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచిత సేవలు

ధర్మారం: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, హక్కులతోపాటు బాధ్యతలను గుర్తించి వ్యవహరించాలని జిల్లా న్యాయ సేవల అధికారి శ్రీనివాస్‌ యాదవ్‌ సూ చించారు. స్థానిక ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు సోమవారం ఉచిత న్యాయ సేవలు, చట్టాలపై అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని సూచించారు. బాలికలు అపరిచిత ఫోన్‌కాల్స్‌, సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పేద, మధ్యతరగతి తేడా లేకుండా ప్రతీఒక్కరికి ఉచిత న్యా య సాయం అందించేందుకు న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. ప్రిన్సిపాల్స్‌ ఈరవేని రాజ్‌కుమార్‌, అనంత రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వెండి తొడుగు బహూకరణ

యైటింక్లయిన్‌కాలనీ: కాలనీకి చెందిన బొద్దుల ఓదెలు – పద్మ దంపతులు స్థానిక విశ్వకర్మ శి వాలయంలోని శివలింగానికి 800 గ్రాముల వెండితో తయారు చేసిన తొడుగును సోమవా రం బహూకరించారు. ఆయల కమిటీ చైర్మన్‌ నాగుల మల్యాల రాజమౌళి, అర్చకుడు మారుపాక శ్రీనివాసా చార్యులకు తొడుగును అందజేశారు. దీనివిలువ దాదాపు రూ.లక్ష 60వేలు ఉంటుందని అర్చకులు తెలిపారు. స్వామివారి శేషవస్త్రాలతో భక్తులను సత్కరించారు.

చర్చిలకు ఆర్థిక చేయూత

పెద్దపల్లి: క్రిస్మస్‌ సందర్భంగా చర్చిల అభివృద్ధి, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఒక్కోదాని కి రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. చర్చిలకు వైట్‌ వాషింగ్‌ (సున్నం వేయడం), విద్యుత్‌ దీపాలంకరణ ఖర్చుల కోసం ఈ నిధులను కేటాయించింది.

ప్రపంచ సదస్సుకు మేయర్‌

కోల్‌సిటీ: నగర పాలన, పట్టణాభివృద్ధిపై చర్చించేందుకు ముంబయిలో ఈనెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ మేయర్ల సదస్సుకు రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి హాజరుకానున్నారు. ఈమేరకు రామగుండం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ మేయర్లు మహంకాళి, కోలగాని శ్రీనివాస్‌, మమత గుమ్ములుకు ఆ హ్వానం అందింది. దేశ, విదేశాల మేయర్లు, పాలన నిపుణులు, విధాన నిర్ణేతలు తమ అను భవాలు పంచుకోనున్నారు. పాలనలో వినూ త్న పద్ధతులు, పర్యావరణంపై చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement