పెద్దపల్లి: సమస్యల రూపంలో ప్రజలు అందించే అ ర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు క లెక్టర్ శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రం చేయండి
ఒకటో వార్డులో ఇంటి పక్కన డ్రైనేజీ చేరుతంది. చెట్లుపెరిగి దోమలు వృద్ధి చెందుతున్న యి. పాములు వచ్చి స్థానికుల కాటు వేస్తున్నయి. మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. పరిసరాలు పరిశుభ్రం చేయండి.
– బర్ల రమేశ్, శాంతినగర్
బెల్ట్‌షాపులు ఎత్తివేయాలి
జిల్లాలోని బెల్ట్ షాపులను వెంటనే ఎత్తివేయాలి. సమాచార చట్టం ప్రకారం అధికారులను అడిగినప్పుడే చర్యలు తీసుకొని తర్వాత చేతులెత్తేస్తున్న. యువత మత్తుకు బానిసలు కావద్దన్నదే మా సంకల్పం.
– పెద్దపల్లి సందీప్, మీయాపూర్
40ఏళ్లుగా సాగు చేసుకుంటున్న
40ఏళ్ల కింద మా తండ్రులు సాదా బైనామాతో భూమి కొన్నరు. అప్పట్నుంచి సాగుచేసుకుంటు ఉపాధి పొందుతున్న. పట్టా చేయాలని కోరుతుంటే.. పాత పట్టాదారు, అధికారులు డబ్బులు అడుగుతున్నరు.
– పాపయ్యరాదమ్మ, మంథని
సమస్యలు పరిష్కరించాలి
గ్రామ పంచాయతీ వార్డు స భ్యులకు గౌరవ వేత నం చెల్లించాలి. ప్రగతి పనుల శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాల శిలాఫలకాలపై మా పేర్లుండాలి. ముద్రించాలి. – తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం


