రహదారి ఛిద్రం.. ప్రయాణం భద్రం | - | Sakshi
Sakshi News home page

రహదారి ఛిద్రం.. ప్రయాణం భద్రం

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

ఒకప్పుడు వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేర్చిన రహదారి..

ఇప్పుడు గుంతలు, తేలిన కంకరతో ఛిద్రమైంది. గోపాల్‌పూర్‌ ఇసుక క్వారీ నుంచి భారీ లారీల రాకపోకలతో దెబ్బతిన్న చిన్న ఓదాల–గోపాల్‌పూర్‌ రహదారి.. క్వారీ మూతపడినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ రహదారికి కొత్త రూపు ఎప్పుడు వస్తుందోనని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. అడుగడుగునా గుంతలు, బయటకు తేలిన కంకరతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గుంతలను తప్పించబోయి వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర సమయంలో రోగులను ఆస్పత్రులకు తరలించడమూ కష్టంగా మారింది. రహదారికి మరమ్మతులు చేసి ప్రయాణ కష్టాలు

తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. – మంథని రూరల్‌

రహదారిపై ఏర్పడిన గుంతలు

రహదారిపై తేలిన కంకర రాళ్లు

ఛిద్రమైన చిన్న ఓదాల– గోపాల్‌పూర్‌ రోడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement