మరమ్మతులు భారం.. సేవలు దూరం | - | Sakshi
Sakshi News home page

మరమ్మతులు భారం.. సేవలు దూరం

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

కదల్లేని వైకుంఠరథం, పనిచేయని బాడీఫ్రీజర్లు నెలరోజులుగా నిలిచిన ఫాగింగ్‌ అధికారుల నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న సేవలు

కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలో ప్రజలకు అందించాల్సిన కీలక సేవలు అధికారుల నిర్లక్ష్యంతో కుంటుపడుతున్నాయి. లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు, వాహనాలు మరమ్మతుకు నోచుకోక మూలనపడుతున్నాయి. పేద కుటుంబాలకు ఉపయోగపడాల్సిన 3 బాడీ ఫ్రీజర్లు పనిచేయడం లేదు. అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన వైకుంఠరథాలు సాంకేతిక సమస్యలతో కదలని స్థితికి చేరుకుంటున్నాయి. దోమల నివారణకు ఉపయోగించాల్సిన ఫాగింగ్‌ యంత్రాలు నెల రోజులుగా నిలిచిపోయాయి.

ఫ్రీజర్లు ఉన్నా.. ఉపయోగం లేదు

నగరంలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియల వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ మూడు బాడీ ఫ్రీజర్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం మూడూ నిరుపయోగంగా మారాయి. కూలింగ్‌ వ్యవస్థలో వైఫల్యాలు, ఇతర సాంకేతిక లోపాలతో పనిచేయడం లేదు. వీటికి మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు కోరారు. ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌ సైతం మరమ్మతు చేపట్టాలని అధికారులను ఆదేశించినా కార్యాచరణ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైకుంఠరథాలకు మరమ్మతు గ్రహణం

హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందినవారు మృతిచెందితే అంత్యక్రియల కోసం నగరపాలక సంస్థ ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణను మాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనాలు ఒక్కొక్కటిగా మరమ్మతుకు చేరుతున్నాయి. హిందువుల కోసం ఉన్న రెండు వై కుంఠరథాల్లో ఒకటి పూర్తిగా మూలకు పడింది. ఒక వాహనంలో డీజిల్‌ సరఫరా చేసే ఎలక్ట్రానిక్‌ పంపు చెడిపోవడంతో పా టు విద్యుత్‌ వైరింగ్‌లో సమస్యలు తలెత్తాయి. మరో వాహనంలోనూ వైరింగ్‌, బ్రేక్‌ సెట్టింగ్‌, హ్యాండ్‌ బ్రేక్‌ సమస్యలు ఉన్నాయి. ఈ రెండు వాహనాలకు చెందిన బ్యాటరీలూ పనిచేయడం లేదు. దీంతో ముస్లిం, క్రైస్తవ వాహనాల బ్యాట రీలను తాత్కాలికంగా హిందూ వైకుంఠరథాలకు అమర్చి నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది.

నెల రోజులుగా నిలిచిన ఫాగింగ్‌

కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలో ప్రజలకు అందించాల్సిన కీలక సేవలు అధికారుల నిర్లక్ష్యంతో కుంటుపడుతున్నాయి. లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు, వాహనాలు మరమ్మతుకు నోచుకోక మూలనపడుతున్నాయి. పేద కుటుంబాలకు ఉపయోగపడాల్సిన 3 బాడీ ఫ్రీజర్లు పనిచేయడం లేదు. అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన వైకుంఠరథాలు సాంకేతిక సమస్యలతో కదలని స్థితికి చేరుకుంటున్నాయి. దోమల నివారణకు ఉపయోగించాల్సిన ఫాగింగ్‌ యంత్రాలు నెల రోజులుగా నిలిచిపోయాయి.

దోమల నివారణకు కొనుగోలు చేసిన ఫాగింగ్‌ యంత్రాలు నెలరోజు లుగా మూలకుపడ్డాయి. రెండు ఆటో ట్రాలీలపై ఏర్పాటు చేసిన ఫాగింగ్‌ యంత్రాలు ప్రస్తుతం అలంకారప్రాయంగా మారాయి. స్వల్ప సాంకేతిక సమస్యలు త లెత్తినప్పుడు వెంటనే మరమ్మతు చేయిస్తే తిరిగి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వాటి సేవలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement