బాలల హక్కులను పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కులను పరిరక్షించాలి

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

పెద్దపల్లిరూరల్‌: బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. చిల్డ్రన్స్‌ డే వారోత్సవాల్లో భాగంగా సోమవారం పెద్దపల్లిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో క్విజ్‌, పాటలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా జడ్జి సునీత, అడిషనల్‌ జిల్లా జడ్జి స్వప్నరాణి, సీనియర్‌ జడ్జి భవాని ప్రశంసాపత్రాలు అందించారు. విద్యాబోధన ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. ఎంఈవో సురేందర్‌, శ్రీనివాస్‌, భానుకృష్ణ, సంకీర్తన, సుమలత, రమాదేవి, బర్ల రమేశ్‌, నరేశ్‌, శరత్‌, ఝాన్సీ తదితరులున్నారు.

ప్రతీ ఫిర్యాదుపై తక్షణం స్పందించాలి

గోదావరిఖని: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై అధికారులు తక్షణం స్పందించాలని రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ఝా ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీస్‌ స్టేషన్ల అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి

యైటింక్లయిన్‌కాలనీ: ఎల్‌నినో నేపథ్యంలో రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి సూచించారు. సోమవారం 19వ డివిజన్‌ అల్లూరు గ్రామంలో కార్పొరేటర్‌ మారెల్లి సుశీల ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్‌ గడ్డం తిరుపతితో కలిసి ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చే స్తామన్నారు. 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ అను ము స్వరూప, నాయకులు బండ రమేశ్‌రెడ్డి, బత్తిని శ్రీనివాస్‌, సదుల రాజేశ్‌, మేకల అజ య్‌, బొల్లం రాజు, పూజారి రాకేశ్‌, శ్రీనివాస్‌, చిరుకొండ అక్షయ్‌, ఓరుగంటి సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

టెండర్లలో పాల్గొనాలి

జ్యోతినగర్‌: ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు ఎన్టీపీసీ టెండర్లలో చురుగ్గా పాల్గొని సంస్థతో వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని ఈడీ ఫైయాజ్‌ తయ్యబ్‌ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర కీలకమన్నారు. అనంతరం ఎన్టీపీసీ కాంట్రాక్టస్‌ అండ్‌ మెటీరియల్స్‌ విభాగం ప్రతినిధులు శివకుమార్‌, అమన్‌పాండే ఎంఎస్‌ఈల సేకరణ విధానం, భవిష్యత్‌ అవకాశాలపై వివరించారు. డీజీఎం మేడ నాగరాజా విక్రేతల నమోదు, బూడిద రవాణా అవకాశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. జీఈఎం ట్రైనర్‌ అహోనా మజుందార్‌ ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్‌లో నమోదు, టెండర్లలో పాల్గొనే విధానాన్ని వివరించారు. డీజీఎం (ఫైనాన్స్‌) బట్టు కిషన్‌ విక్రేతల ఇన్వాయిస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌పై అవగాహన కల్పించారు. ఏజీఎం (సీఅండ్‌ఎం) రాకేశ్‌ ఆనంద్‌ తదితరులు పలు అంశాలపై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement