● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష | - | Sakshi
Sakshi News home page

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా రామగుండం మండలం వీర్లపల్లి గ్రామస్తులు 40 ఏళ్ల క్రితం గ్రామం వద్ద వర్షం నీరు పోయేందుకు రెండుపైపులతో నిర్మాణం చేశామని, పైపుల స్థానంలో బ్రిడ్జి నిర్మాణం చేసి సమస్య పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారు. సుల్తానాబాద్‌ మండలం అల్లిపూర్‌ రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన మూట రాధ తాను వికలాంగురాలునని, తన భర్త కుమార్‌ తనను, పిల్లల బాగోగులు చూసుకోవడం లేదని విన్నవించగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని సుల్తానాబాద్‌ తహసీల్దార్‌కు సూచించారు. శ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లికి సామ తిరుపతి తాను దివ్యాంగుడినని చేయూత పెన్షన్‌, పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన దుబ్బాకుల శారద ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement