కనీస వేతనం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనం చెల్లించాలి

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

ఆశావర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ, బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. 21 ఏళ్లుగా ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్నామని శ్రమకు తగిన వేతనం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్‌ 15 నుంచి సమ్మె చేపడతామని హెచ్చరించారు. జ్యోతి, స్వరూప, శోభారాణి, శారద, అమృత, ప్రేమలత పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

సగరుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకుల మొండయ్య మాట్లాడుతూ, సగరులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ జాబితాలోకి మార్చాలని డిమాండ్‌ చేశారు. జీవో 59 సవరించి ప్రభుత్వ పనులు, టెండర్లలో 15– 20 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. సంఘం బాధ్యులు అంకల్ల రాజామొగిలి, మార్కుల క్ష్మణ్‌, గాండ్ల మోహన్‌, దేవుని తిరుపతి, ఎంజాల సదానందం పాల్గొన్నారు.

– పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement