గోదావరిఖని: నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం చూపొద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. కమిషనరేట్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో గురువారం నేరాల నియంత్రణ, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు, నేర పరిశోధన తదితర అంశాలపై సమీక్షించారు. ఉన్నతాధికారుల సమాచారంపై వెంటనే స్పందించాలన్నా రు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల కార్యకలాపాల ను రాజకీయ, ఇతర అనుబంధాలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా, నిశితంగా పరిశీలించా లని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పారు. గంజాయి, మాదకద్రవ్యాల తరలింపు, పేకాట, రేషన్ బియ్యం, పశువులు, ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రదేశాలు, నేరస్థుల కదలికలు, అక్రమ కార్యకలాపాలపై ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలతోపాటు అడ్మిన్ డీసీపీ భాస్కర్, రాంరెడ్డి, శ్రీనివాస్, గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, ఏఆర్ ఏసీపీలు ఎం.రమేశ్, కృష్ణ, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు, రమేశ్, సైబర్ క్రైం డీఎస్పీ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ వాహనాల పనితీరును సీపీ పరిశీలించి పలు సూచనలు చేశారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా


