జూలపల్లి: గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. కుమ్మరికుంట, కోనరావుపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని, దిగుబడులకు మద్దతు కల్పిస్తామని చెప్పారు. రెప్పపాటు కూడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని, గిట్టనివారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. మహిళలు పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. జూలపల్లితోపాటు వివిధ గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. ఎంపీడీవో పద్మజ, తహసీల్దార్ ప్రసాదరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మ పోచాలు, పీఏసీఎస్‌చైర్మన్ లోక జలపతిరెడ్డి, సర్పంచులు తొగరు శ్రీనివాస్, దండె వెంకటేశ్వర్లు, సంపత్‌కుమార్, నరేందర్‌రెడ్డి, తిరుపతి, అరుణ, కావేరి, అనూష తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


