రాత్రివేళ కమాన్ కింది నుంచే నడుచుకుంటూ ఇంటికి వెళ్లా. గురువారం పొద్దున కూరగాయల మార్కెట్‌కు వెళ్దామని వస్తే కమాన్ కనిపించలే. పెద్దపల్లికి ప్రత్యేక గుర్తింపుగా ఉండే కమాన్ లేకపోవడం బాధనిపించింది. అయినా ప్రజల ఇబ్బందులు దూరమవుతాయనే సంతోషం కూడా ఉంది.
– కందునూరి సంజీవరావు, పెద్దపల్లి
భావితరాల కోసం కట్టాలి
దాదాపు వందేళ్ల క్రితం నిర్మించిన కమాన్‌తో ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజల ఇబ్బందులు దూరం చేసేందుకు కూల్చిన అధికారులు.. కొత్త కమాన్ నిర్మించడంపై అన్ని కోణాల్లో ఆలోచించాలి. భావితరాలకు కనీసం మరో వందేళ్లపాటు ఉండేలా విశాలంగా నిర్మిస్తేనే మంచిది.
– ఠాకూర్ రాంసింగ్, బీజేపీ నాయకుడు
ఆధునిక హంగులతో నిర్మిస్తాం
కమాన్ ప్రాంతం ఇరుకుగా మారింది. రాజీవ్‌రోడ్డును ఆనుకుని ఉన్న కమాన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. శాశ్వత పరిష్కారం చూపాలనే పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దపల్లికి ప్రధాన గుర్తింపుగా ఉన్న కమాన్ ప్రాంతంలో ఆధునిక హంగులతో కొత్తది త్వరలోనే నిర్మిస్తాం.
– వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్


