క్షణాల్లో వెయిటింగ్ లిస్ట్! మకర జ్యోతి దర్శనానికి అయ్యప్ప భక్తులకు ఇక్కట్లే డిసెంబర్, జనవరిలో కేరళం వైపు రైళ్లన్నీ కిటకిట ఇంకా ప్రకటించని ప్రత్యేక రైళ్ల వివరాలు
కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుకు కసరత్తు
గోదావరిఖని/కోల్‌సిటీ: రామగుండం నగరంలో కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు వేగవంతం చేస్తోంది. నగర అధ్యక్షుడు, కార్పొరేటర్ ఎండీ ముస్తఫా.. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నూతన టౌన్, డివిజన్ అధ్యక్షుల నియామక ప్రక్రియను చేపట్టారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ, నిబద్ధత, నిజాయితీ, అంకితభావం కలిగిన నాయకులకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన నియామక జాబితాను గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌కు అందజేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా టౌన్, డివిజన్ స్థాయి నాయకులందరినీ సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ సంఘటన్‌సృజన్ అభియాన్ ఛైర్మన్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని ముస్తఫా తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
పెద్దపల్లి: నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ సంఘం నాయకులు మణికేశ్వర్, శ్రావణ్, కోరారు. ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం 31వ రోజుకు చేరుకుందని, ప్రభుత్వం స్పందించి చర్చలకు ఆహ్వానించాలని కోరారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సమ్మె శిబిరంలోనే వినూత్నంగా చెవులకు పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేందర్, లక్ష్మణ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కమాన్ కూల్చివేత సరికాదు
పెద్దపల్లి: కమాన్ కూల్చివేతను చీకటి దినంగా తా ప్రోచ్ యూఎంయూడబ్ల్యూఎస్ జనరల్ సెక్రటరీ అభివర్ణించారు. బుధవారం అర్ధరాత్రి ప్రజలంతా ఇళ్లకు వెళ్లిన తర్వాత అధికారులు కమాన్‌ను కూల్చివేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
నాణ్యమైన బొగ్గు సరఫరా మన కర్తవ్యం
రామగిరి: వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయడం మన కర్తవ్యంగా భావించాలని రామగుండం–3 ఏరియా ఎస్‌వోటూ జీఎం రామ్మోహన్ అన్నారు. గురువారం ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో నిర్వహంచిన బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో మాట్లాడారు. ఉద్యోగులందరూ కలిసికట్టుగా బొగ్గు నాణ్యత పెంపునకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం.రామచంద్రారెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, నాణ్యత విభాగతిపతి ఆసీఫ్ యాసిన్, విభాగధిపతులు సురేఖ, అఫ్సర్ పాషా, ఐలయ్య, రాజారవిచరణ్, ప్రశాంత్ జీవన్, ఆసీఫ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
సింగరేణి నర్సరీకి కొత్త టెండర్ పిలవాలి
గోదావరిఖని: ఆర్జీ–2 డివిజన్‌లో నర్సరీ నూతన టెండర్లకు సవరణ చేసి జాప్యం లేకుండా పిలవాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.అశోక్ కోరారు. గురువారం ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నర్సరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు, సీఎంపీఎఫ్, ఉచిత వైద్యం, బోనస్ తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం సర్కులర్ జారీ చేసిందని, టెండర్‌లో స్పష్టత లేదన్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికై నా నర్సరీ టెండర్లను సవరణ చేసి కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మహిళా కాంట్రాక్టు కార్మికులు వనమాల, మల్లేశ్వరి, కట్ల మనమ్మ, సుజాత, నేలమ్మ, డి.లక్ష్మి, సునీత, హనుమమ్మ తదితరులు పాల్గొన్నారు.


