భూపాలపల్లి అర్బన్: నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి సమిష్టిగా కృషి చేయాలని ఏరియా ఇన్‌చార్జి జీఎం శ్యామ్‌సుందర్ తెలిపారు. ఏరియాలో గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాలు–2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. జీఎం కార్యాలయ ఆవరణలో నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బొగ్గు వెలికితీత నుంచి రవాణా వరకు ప్రతీదశలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మట్టి, బండరాళ్లు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం రమణ్ వీ. పాఠక్, పర్సనల్ మేనేజర్ శ్యామ్‌సుందర్, ఏఐటీయూసీ నాయకుడు మోటపలుకుల రమేశ్, ఐఎన్‌టీయూసీ నాయకుడు బి.మధుకర్‌రెడ్డి, సీఏంవోఏఐ ప్రతినిధి ప్రదీప్, క్వాలిటీ ఇన్‌చార్జి మేనేజర్ కుమారస్వామి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


