ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా క్రీడా పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా క్రీడా పోటీలు ప్రారంభం

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

సుల్తానాబాద్‌రూరల్‌: భూపతిపూర్‌లోని జ్యో తిబాపూలే గురుకుల పాఠశాలలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాస్థాయి జ్యోతిబాపూలే గురుకులాల క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎస్సై చంద్రకుమార్‌ హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడలతోనే క్రమశిక్షణతోపాటు శరీరదారుఢ్యం పెరుగుతుందని తెలిపారు. అండర్‌–17లో జరిగే వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి జిల్లాలోని గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సర్పంచ్‌ పోచంపల్లి చిన్నయ్య, బీసీ గురుకుల ప్రిన్సిపాల్‌ హెన్రీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ సంతోష్‌కుమార్‌, డిప్యూటీ వార్డెన్‌ ప్రమోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సస్పెన్షన్‌ ఎత్తివేయకుంటే ఢిల్లీ వరకూ పోరాటం

పెద్దపల్లి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిర్వహించిన స్కూల్‌ బ్యాగుల పంపిణీకి హాజరైనందుకు కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు నాయకులను సస్పెండ్‌ చేయడంపై మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి దేవు భూమయ్య, కొయ్యూరు ఉపసర్పంచ్‌ లక్కవు సవేందర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవు భూమయ్య మాట్లాడుతూ, అక్టోబర్‌ 26న కొయ్యూరు పాఠశాలలో ఎంపీ పేద విద్యార్థులకు బ్యాగుల పంపిణీ చేశారని, పలువురు సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు హాజరైనా ముగ్గురినే సస్పెండ్‌ చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తక్షణమే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, లేకుంటే ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొయ్యూరు ఉపసర్పంచ్‌ లక్కవు సవేందర్‌ మాట్లాడారు. నాయకులున్నారు.

బైక్‌ను ఢీకొట్టిన కారు..

ఒకరికి తీవ్రగాయాలు

యైటింక్లయిన్‌కాలనీ: అల్లూరు దర్గా సమీపంలోని కోల్‌కారిడర్‌పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి త్రీవ గాయాలయ్యాయి. స్థానికులు, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది కథనం ప్రకారం.. పోతనకాలనీ న్యూరేడుపాకకు చెందిన మబ్బు శంకర్‌ ద్విచక్రవాహనంపై సైలోబంకర్‌ నుంచి న్యూమారేడుపాకకు వస్తున్నాడు. ఎదురుగా గోదావరిఖనికి నుంచి పోతనకాలనీ వైపు వస్తున్న కారు డ్రైవర్‌ తెడ్ల రాకేశ్‌.. వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. శంకర్‌ కింద పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. శంకర్‌ వీనైను కాంపెపీలో ప్రైవేట్‌ వోల్వ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement