● డైరెక్టర్ వెంకటేశ్వర్లు
గోదావరిఖని: జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సత్తా చాటి సింగరేణి పేరుప్రతిష్టలు నిలపాలని ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. గురువారం ఆర్జీటూ ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను సందర్శించి, శిక్షణ పొందుతున్న మూడు రెస్క్యూ టీంలతో సమావేశమయ్యారు. శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత. రెస్క్యూ పట్టు ఎంతో కీలకమన్నారు. అనంతరం సింగరేణి మహిళా రెస్క్యూ టీమ్ నిర్వహించిన రెస్క్యూ రిలే వ్యాయామ విన్యాసాలను తిలకించి అభినందించారు. ఒక మహిళ, రెండు పురుష జట్ల కెప్టెన్లు కృష్ణవేణి, ప్రమోద్, నితిన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్, ఆర్జీ–3 జీఎం మధుసూదన్, ఏపీఏ జీఎం నాగేశ్వర్రావు, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నిర్దేశిత లక్ష్యాలను భద్రతతో సాధించాలి
రామగిరి: నిర్దేశించిన బొగ్గు, ఓబీ ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించాలని ౖప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 వ్యూ పాయింట్ పనులను పరిశీలించి అనంతరం రామగుండం–3 ఏరియా జనరల్ మేనేజర్ మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు, రామగుండం –2 ఏరియా జనరల్ మేనేజర్ టి.లక్ష్మీపతి గౌడ్ తదితరులతో జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్వోటూ జీఎం రాంమోహన్, ఏరియా ఇంజినీర్ ఉదయ్ భాస్కర్, ప్రాజెక్టు అధికారులు ప్రవీణ్ వి ఫ్యాటింగ్, రాజశేఖర్, ఏరియా సర్వే అధికారి అఫ్సర్ పాషా, ఎస్టేట్స్ అధికారి ఐలయ్య, మేనేజర్ పాపయ్య, ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


