వ్యసనాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వ్యసనాలకు దూరంగా ఉండాలి

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

● పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

● పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

గోదావరిఖని: యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. గురువారం స్థానిక చంద్రశేఖర్‌నగర్‌లో సైబర్‌మోసాలు, గంజాయి వినియోగం, రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. గంజాయి వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్‌నేరాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం

యైటింక్లయిన్‌కాలనీ: గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పెద్దపల్లి డీసీసీ రాంరెడ్డి సూచించారు. మిషన్‌ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గురువారం రామగిరి మండలం చందనాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్యూలనపై అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాల గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలని సూచించారు. డ్రగ్స్‌రహిత సమాజ నిర్మాణానికి ప్రతీఒక్కరు సహకరించాలని కోరారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, టూటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు, సర్పంచ్‌ కొండ మంజుల, ఉప సర్పంచ్‌ రజిత, సింగిరెడ్డిపల్లి సర్పంచ్‌ యమున, కాంగ్రెస్‌ నాయకులు మహేశ్వర్‌రావు, ఓదెలు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement