నాణ్యతతోనే సింగరేణి మనుగడ | - | Sakshi
Sakshi News home page

నాణ్యతతోనే సింగరేణి మనుగడ

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

● ఆర్జీవన్‌ జీఎం లలిత్‌కుమార్‌

● ఆర్జీవన్‌ జీఎం లలిత్‌కుమార్‌

గోదావరిఖని: నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు అందించడంతోనే సింగరేణి మనుగడ సాధ్యమని ఆర్జీవన్‌ జీఎం లలిత్‌కుమార్‌ అన్నారు. జీఎం కార్యాలయంలో నాణ్యత వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం నాణ్యత ప్రతిజ్ఞ నిర్వహించారు. బొగ్గు వెలికితీసే సమయంలో బండ, మట్టి, షేల్‌ లేయర్లను వేరుచేస్తూ మంచి గ్రేడ్‌ బొగ్గు లోడింగ్‌ చేయాలని సూచించారు. జీడీకే–2ఏ భూగర్భ గనిలో షేల్‌లేయర్‌ను వేరు చేస్తూ నాణ్యతను పెంచుకున్నారని, అలాగే జీడీకే–1లో మంచి నాణ్యత గల బొగ్గును అందిస్తుండటంతో స్థానిక వినియోగదారులు పోటీపడి రోజుకు సుమారు 500 టన్నులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. క్వాలిటీ జీఎం వెంకటరమణ, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్‌, ఏజీఎం కాశీవిశ్వేశ్వరరావు, బ్రహ్మాజీరావు, ధనలక్ష్మీబాయి, రెడ్డిమల్ల తిరుపతి, మోహన్‌రావు, కర్ణ, వేణు, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సంస్థలకు నాణ్యమైన బొగ్గు అందించాలి

విద్యుత్‌ సంస్థలకు నాణ్యమైన బొగ్గు అందించాలని ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్‌ సూచించారు. జీఎం కార్యాలయంలో నాణ్యత వారోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. ఎస్‌వోటూ జీఎం రాముడు, ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ గంధం సాంబశివరావు, అధికార ప్రతినిధి ఎన్‌.వేణుగోపాల్‌, అడిషనల్‌ మేనేజర్‌ (క్వాలిటీ)సుభాష్‌, డీజీఎం చంద్రశేఖర్‌, వెంకటరామచంద్ర, బాలరాజు, షరీఫ్‌ మహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement