అయ్యప్ప ఆలయానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప ఆలయానికి విరాళం

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

కాల్వశ్రీరాంపూర్‌: మండల కేంద్రంలో ఇటీవల నిర్మించిన అయ్యప్ప ఆలయానికి భూపాలపల్లి(జయశంకర్‌) జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావ్‌పల్లి(బి)గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాముల భక్త బృందం రూ.50,116 విలువ గల చెక్కును ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ పి.వీరారెడ్డికి గురువారం రాత్రి అందజేశారు. అయ్యప్ప మాలదారులకు స్థానిక ఆర్యవైశ్య మహిళా సంఘం మండల అధ్యక్షురాలు ఇమ్మడి జ్యోతి శ్రీనివాస్‌ తమ మునుమరాలు శ్రీనిక పుట్టినరోజు సందర్భంగా బిక్ష ఏర్పాటు చేశారు. అయ్యప్ప సేవాసంఘం, ఆలయ కమిటీ చైర్మన్‌ పి.వీరారెడ్డి, వెంకట్రావ్‌పల్లి(బి) అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ముత్తారం: ప్లాస్టిక్‌రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని హరిపురం సర్పంచ్‌ మెంగని సమతతిరుపతి పటేల్‌ అన్నారు. గ్రామంలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌, చెత్తను గురువారం గ్రామ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించారు. గ్రామంలో ప్లాస్టిక్‌కు బదులు జ్యూట్‌ బ్యాగులు వాడాలని కోరారు. ఉపసర్పంచ్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement