అవయవదానానికి ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

అవయవదానానికి ముందుకు రావాలి

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

ఓదెల: అవయవదానానికి అందరూ ముందుకు రావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, ఓదెల మాజీ జెడ్పీటీసీ గంట రాములుయాదవ్‌ కోరారు. మండలంలోని గుంపులలో మాజీ సర్పంచ్‌ ఉప్పుల సంపత్‌ తండ్రి ఉప్పుల మల్లేశం సంస్మరణ సభ సదాశయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులకు అభినందన పత్రం అందించి సన్మానించారు. పొత్కపల్లి సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ గట్టు రమాదేవి శ్రీనివాస్‌, సదాశయ ఫౌండేషన్‌ జాతీయ కార్యదర్శి మేరుగు భీష్మాచారి, గోపరపల్లె సర్పంచ్‌ మద్దెనవేని రవి, బీజేపీ నాయకులు సుగుణాకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement