సుల్తానాబాద్‌రూరల్: సమాజ సేవలో విశేష సేవలుఅందించినందుకు శ్రీవాణి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లయన్ రేకులపల్లి విజయ చినజీయర్‌స్వామి చేతుల మీదుగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాతృసవనం పురస్కారం అందుకున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన మహిళలకు ప్రత్యేక గౌరవం అందించగా రేకులపల్లి విజయకు స్థానం దక్కడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కళాశాల కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, ప్రిన్సిపాల్స్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


