కరువు నివారణ చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

కరువు నివారణ చర్యలేవి?

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

కాల్వశ్రీరాంపూర్‌: ఎల్‌నినో దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కరువు నివారణ చర్యలేవని ఐడీసీ మాజీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలంలోని లక్ష్మిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాయపేట ఎత్తిపోతల ప్రాజెక్టును గురువారం మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాయపేట ఎత్తిపోతల ప్రాజెక్టును ఇంకా అభివృద్ధి చేస్తే నీటి కరువుకు చెక్‌ పెట్టొచ్చన్నారు. ప్రభుత్వం, కలెక్టర్‌, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. మాజీ సర్పంచ్‌ బైరం రమేశ్‌, నాయకులు నక్కల కొమురయ్య, ఆడెపు రాజు, నల్ల రాజిరెడ్డి, గణపతిరెడ్డి, వీరేశం, తిరుపతి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, స్వామిరెడ్డి, రమేశ్‌, చందు, దేవేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

ధర్మారం: మండల కేంద్రంలోని సాయిమణికంఠ హైస్కూల్‌ విద్యార్థి మహన్య ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీఈటీ సాయికుమార్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహించనున్న 70వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీలకు కరీంనగర్‌ జట్టు నుంచి మహన్య పాల్గొంటుందన్నారు. విద్యార్థిని పాఠశాల కరస్పాండెంట్‌ జైన సురేశ్‌కుమార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమాదేవి, ఉపాధ్యాయులు అభినందించారు.

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

ఎలిగేడు: ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎలిగేడు సింగిల్‌విండో చైర్మన్‌ సామ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొట్యాల రమేశ్‌ కోరారు. మండల కేంద్రంలోని ధూళికట్ట సింగిల్‌విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. సర్పంచ్‌ మారం కొమురయ్య, ఉపసర్పంచ్‌ మేచినేని అండాలు, సింగిల్‌విండో కార్యదర్శి బద్దం రవీందర్‌రెడ్డి, వార్డుసభ్యులు, రైతులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర

జూలపల్లి: రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్‌ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని పత్తిపాక పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల వెంకట్‌రెడ్డి సూచించారు. మండలంలోని అబ్బాపూర్‌లో పత్తిపాక సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో వైస్‌ చైర్మన్‌ పసునూటి శ్రీనివా స్‌, డైరెక్టర్‌ జంగం సతీశ్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. సర్పంచ్‌ దండె వెంకటేశ్వర్లు, సెక్రటరీ బుచ్చయ్య, రైతులు ఉన్నారు.

పదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలి?

రామగిరి: పదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని రాజాపూర్‌ సర్పంచ్‌ పుల్లెల భాగ్యలక్ష్మీ–కొమురయ్య కోరారు. గురువారం రాజాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజాపూర్‌కు చెందిన 708 ఎకరాల భూముల అవార్డు విషయంలో రైతులకు ఇచ్చిన హామీలు, పరిహారం అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత పదేళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలకవర్గం పనితీరుపై గ్రామాల వారీగా లెక్కలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పుల్లెల సతీశ్‌, కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్‌, యూత్‌ అధ్యక్షుడు మాటేటి శ్రీనివాస్‌, వార్డుసభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement