ఎలిగేడు: మండలంలోని సుల్తాన్పూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన సాయి విజ్ఞతకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అందజేసిన సైకిల్‌ను గురువారం బహూకరించారు. ఎంపీ ఈనెల 10న సుల్తాన్‌పూర్‌లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు విశాఖ చారిటబుల్ ట్రస్టు ద్వారా బ్యాగులు పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠఽశాలకు చెందిన ముత్యాల సాయివిజ్ఞత 2025–26లో కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా స్థాయిలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా తెలుగు విషయంలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకరాగా విద్యార్థినిని అభినందించి సైకిల్ బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. విద్యార్థినికి సైకిల్ పంపించగా గురువారం పాఠశాలలో విద్యార్థికి అందజేశారు. సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య, ఎంఈవో నరేంద్రచారి, స్కూల్‌కాంప్లెక్స్ హెచ్ఎం దేవేందర్‌రావు, పాఠశాల హెచ్ఎం అప్పిడి సంతోష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అడ్గగుంట శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.


