రామగుండం: రామగుండం కస్తూర్బాగాంధీ విద్యాలయానికి ఇటీవల ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించిన విషయం తెలిసిందే. ఐఓఈ గుర్తింపు వచ్చిన కేజీబీవీల్లోని జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు అందజేసింది. ప్రత్యేక తరహా కోచింగ్ ఇచ్చేందుకు స్టాఫ్‌ను నియమించారు. ఇందులో భాగంగా 2027–28వ విద్యా సంవత్సరంలో కేజీబీవీ విద్యార్థినులు జేఈఈ, నీట్‌లలో అత్యున్నత కళాశాలల్లో సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే విద్యార్థినులకు మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రామగుండం కేజీబీవీలో వరుసగా విద్యార్థినులకు జేఈఈ, నీట్ మాక్‌టెస్ట్‌లు నిర్వహించినట్లు ప్రత్యేకాధికారి కమల పేర్కొన్నారు.


