ఘనంగా బాలల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బాలల దినోత్సవం

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లోని సెయింట్‌ క్లేర్‌ హైస్కూల్‌లో బాలల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డామినిక్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కులం పేరుతో దూషించే వారిపై చర్యలు తీసుకోవాలి

కమాన్‌పూర్‌: దళితులను కులం పేరుతో దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళితులను అవమానించడం, కించపరచడం హేయమైన చర్య అని, రాజకీయంగా దళితులు ఎదుగుతున్న సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని అవమానాలకు గురిచేస్తున్నారన్నారు. కులం పేరుతో దూషించే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కుక్క చంద్రమౌళి, చిప్పకుర్తి సత్యనారాయణ, కుక్క రవి, పులిపాక బొంద్యాలు, పిల్లి నర్సింగం, పొట్ల శంకర్‌, శివలింగం, సురేశ్‌, రాజు, ఓదెలు పాల్గొన్నారు.

రైతును రాజు చేయడమే లక్ష్యం

కమాన్‌పూర్‌: అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన సన్నరకం వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్‌ చెల్లిస్తూ రైతును రాజు చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యమని కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వైనాల రాజు అన్నారు. మండలంలోని గుండారం, కమాన్‌పూర్‌, ముల్కలపలి, నాగారం, పేరపల్లి, సిద్దిపల్లె, రాజాపూర్‌ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఏఎంసీ చైర్మన్‌ ప్రారంభించారు. సర్పంచ్‌లు రంగు సత్యనారాయణ, బంగారు కళ్యాణి, పొనగంటి కుమార్‌, బొంగోని సదయ్య, జంగిలి పోచాలు, ఉప సర్పంచ్‌లు, ఏపీఎం పద్మ, సీసీలు మల్లయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మున్నూరుకాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్రీధర్‌ పటేల్‌

పెద్దపల్లి: మున్నూరుకాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన నూమూరి శ్రీధర్‌ పటేల్‌ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా, బీసీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసి బీసీల హక్కులు, అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేశారు. శ్రీధర్‌ పటేల్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ట్రినిటి విద్యార్థుల ఎంపిక

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లిలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పట్టణంలోని ట్రినిటి హైస్కూ ల్‌కు చెందిన విద్యార్థులు అదృత్‌, సన్నిహిత్‌ పాల్గొని ప్రతిభ చూపారు. స్మగ్‌ పవర్‌ విభాగంలో చేసిన ప్రాజెక్టులో రాష్ట్రస్థాయి నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారని ప్రిన్సిపాల్‌ రమేశ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కుమార్‌ తెలిపా రు. గైడ్‌ టీచర్‌ సంయుక్తతో పాటు ఎంపికై న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మమతారెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement