రామగిరి: కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని గోకుల్‌నగర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కమాన్‌పూర్ పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, కల్వచర్ల సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించొద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిందం తిరుపతి, ఏవో శ్రీకాంత్, ఏఈవో అరవింద్, డైరెక్టర్ సైండ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
మండల టాపర్‌కు ప్రోత్సాహకం
జూలపల్లి: పదో తరగతిలో 2025–26లో 566 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన జూలపల్లికి చెందిన వొల్లాజి సాయి హర్షదకు పెద్దపల్లి బ్రాంచ్ శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ వారు రూ.10వేల ప్రోత్సాహకం అందజేశారు. ఉపసర్పంచ్ కొప్పుల మహేశ్, ఎంఈవో లక్ష్మన్, ఉపాధ్యాయులు, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.


