ఓదెల: ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల వారిధిగా రూపునారాయణపేట మానేరు వంతెన ఉపయోగ పడుతుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా రూపునారాయణపేట, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ మధ్య మానేరుపై రూ.80కోట్లతో చేపట్టిన పనులను విప్ బుధవారం పూజలు చేసి పునఃప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి మానేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.80కోట్లు మంజూరు చేశారని, కొన్నినెలల క్రి తం ప్రారంభించినా.. కాంట్రాక్టర్ల లోపంతో పను లు పూర్తి కాలేదన్నారు. మరో కాంట్రాక్టర్‌కు ప ను లు అప్పగించి మళ్లీ ప్రారంభించామని అన్నారు. సర్పంచులు బొంగోని రమా, శ్రీధర్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు.
దళారులకు విక్రయించొద్దు
రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దుని ప్రభుత్వ విప్ విజయరమణారావు సూచించారు. కొలనూర్, రూపునారాయణపేట, బాయమ్మపల్లె, గుంపుల, గూడెం గ్రామాల్లో మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మాట్లాడారు. సర్పంచులు పల్లె కనుకయ్య, బొంగోని రమా, ఊరగొండ సమ్మక్క, తిట్ల రాము, పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బైరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


