వసూళ్లపై కలెక్టర్‌, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

వసూళ్లపై కలెక్టర్‌, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

కంటెయినర్‌ను తొలగించడంతో అక్రమాలు వెలుగులోకి! మూడేళ్లుగా దాచిన సొమ్ము లెక్కలు చెప్పాలి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని: కుందనపల్లి ఎన్టీపీసీ బూడిద లారీల నుంచి ఒక్కో ట్రిప్పుకు రూ.500 చొప్పున వసూలు చేసిన సొమ్మును ఏంచేశారో కలెక్టర్‌, రామగుండం ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. అంతర్గాం మండలం కుందనపల్లిలోని ఎన్టీపీసీ బూడిద చెరువు నుంచి అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు.. లారీల ద్వారా బూడిద రవాణా చేస్తున్నారని, మార్గమధ్యంలో కంటైనర్‌ ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బంది పే రిట ఒక్కో ట్రిప్పుకు రూ.500 చొప్పున వ సూలు చేస్తున్నారని ఆ యన ఆరోపించారు. ఈవ్యవహారంపై వి మర్శలు రావడంతో కంటైనర్‌ను తాత్కాలి కంగా తొలగించారని, కానీ, మూడేళ్లపాటు వసూలు చేసిన సొమ్ము ఎంత అని, ఆ డబ్బులు ఎవరి చేతులు మారాయని, ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందనే వివరాలను అధికార యంత్రాంగం బయటపెట్టాలని కోరారు. నిజాని జాలు వెలుగులోకి వచ్చేందుకు సీబీఐ, డీవోపీటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని విన్నవిస్తామని కోరుకంటి చందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement