భూపాలపల్లి అర్బన్: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు, పింఛన్‌దారులు కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎఫ్ఎస్) సమర్పించుకోవచ్చని ఏరియా ఎస్వోటూ జీఎం రమణ్ వీ పాఠక్ సూచించారు. బుధవారం ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీహాల్లో నిర్వహించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అవగాహన సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 5.0 కార్యక్రమంలో భాగంగా జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ విధానంలో లైఫ్ సర్టిఫికెట్‌ను సులభంగా సమర్పించవచ్చని వివరించారు. పింఛన్‌దారులు ఈనెల 30వ తేదీ వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్‌సుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ విశ్రాంత్ కుమార్, సీఎంపీఎఫ్ అధికారులు ఎం.శ్రీధర్ (సెక్షన్ ఆఫీసర్), కె.వెంకట్‌రెడ్డి (సీనియర్ ఎస్ఎస్ఏ), ఏఐటీయూసీ నాయకుడు జి.శ్రీనివాస్, ఐఎన్టీయూసీ నాయకుడు బి.మధుకర్‌రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మల్లెపల్లి రవి పాల్గొన్నారు.


