పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు కొత్త బాట | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు కొత్త బాట

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

● ట్రెజరీ చిక్కులకు తెర

రామగిరి: గ్రామపంచాయతీల సొంత ఆదాయాన్ని ఇకపై నేరుగా పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని సెక్షన్‌ 70(3)కు సవరణ చేయడంతో ట్రెజరీలో నిధులు జమ చేసి, వినియోగానికి ఎదురుచూడాల్సిన పరిస్థితికి తెరపడనుంది. దీంతో జిల్లాలోని 263 గ్రామపంచాయతీలకు ఆర్థిక నిర్వహణలో వెసులుబాటు కలగనుంది. పన్నులు, ఫీజుల రూపంలో వచ్చే సొంత ఆదాయం ట్రెజరీలో జమచేయాల్సి రావడంతో నిధుల వినియోగంలో జాప్యం జరిగేది. చిన్న మరమ్మతులు, పారిశుధ్యం నిర్వహణ, వీధిదీపాలు, తాగునీరు, డ్రైనేజీ వంటి అత్యవసర పనులకు కూడా ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. ఇక సొంత ఆదాయం నేరుగా ఖాతాలోకి రావడంతో గ్రామసభ తీర్మానం మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా, ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టే స్వేచ్ఛ లభించనుంది. గ్రామంలో సమకూరే ఆదాయం అదే గ్రామ అభివృద్ధికి వినియోగించే అవకాశం ఏర్పడటంతో ఇతర శాఖలపై ఆధారపడే పరిస్థితి తగ్గనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement