ఠాగూర్‌ స్టేడియంలో క్రికెట్‌ సంబరం | - | Sakshi
Sakshi News home page

ఠాగూర్‌ స్టేడియంలో క్రికెట్‌ సంబరం

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

అట్టహాసంగా ప్రారంభమైన సింగరేణి స్థాయి పోటీలు క్రీడల్లో రాణించి కోలిండియాలో సత్తా చాటాలి మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ

రామకృష్ణాపూర్‌: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంపెనీ స్థాయి క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొంటున్నాయి. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ పోటీలను ప్రారంభించారు. మందమర్రి –బెల్లంపల్లి సంయుక్త జట్టు, శ్రీరాంపూర్‌ జట్టు, మణుగూరు – ఇల్లెందు సంయుక్త జట్టు, కొత్తగూడెం కార్పొరేట్‌ జట్టు, ఆర్జీ 1, ఆర్జీ 2 సంయుక్త జట్టు, ఆర్జీ 3 –భూపాలపల్లి సంయుక్త జట్లు పాల్గొంటున్నాయి. జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోందని, ఈసారి క్రీడా బడ్జెట్‌ పెంచిందని తెలిపారు. కోలిండియా స్థాయి పోటీల్లోనూ రాణించి సింగరేణి కీర్తి ప్రతిష్టలు చాటాలని కోరారు. క్రీడల్లో చూపిస్తున్న ఉత్సాహాన్ని ప్రతిభను బొగ్గు ఉత్పత్తిలోనూ ప్రదర్శించాలని సూచించారు. త్వరలో ఆర్‌కేపీతోపాటు మణుగూరు, తాడిచర్ల, శ్రావణపల్లి ప్రాంతాల్లో కొత్త గనులు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సీఎంవోఏఐ ఏరియా అధ్యక్షుడు రమేశ్‌, డీజీఎం(పర్సనల్‌) అశోక్‌, కేకే గ్రూప్‌ ఏజెంట్‌ ఖాదిర్‌, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి సలెంద్ర సత్యనారాయణ, డబ్ల్యూపీఎస్‌జీఏ సెక్రటరీ కార్తీక్‌, సీనియర్‌ పీవో సురేందర్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్లు అశోక్‌, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తొలిరోజు జరిగిన మ్యాచ్‌లు..

లీగ్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల్లో ఆరు జట్లు రెండు పూల్స్‌గా విడిపోయి తలపడుతున్నాయి. తొలిమ్యాచ్‌లో ఆర్జీ 1, ఆర్జీ 2 సంయుక్త జట్టు, ఆర్జీ 3 –భూపాలపల్లి సంయుక్త జట్టుతో తలపడి గెలుపొందింది. రెండోమ్యాచ్‌ ఆతిథ్య మందమర్రి –బెల్లంపల్లి సంయుక్త జట్టు, శ్రీరాంపూర్‌ జట్ల మధ్య జరుగగా శ్రీరాంపూర్‌ జట్టు గెలుపొందింది. మూడోమ్యాచ్‌ ఆర్జీ 3 –భూపాలపల్లి, ఇల్లెందు –మణుగూరు సంయుక్త జట్ల మధ్య జరగగా ఇల్లెందు –మణుగూరు జట్టు గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement