వెలుగుల రామగుండం.. | - | Sakshi
Sakshi News home page

వెలుగుల రామగుండం..

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

విద్యుత్‌ ఉత్పత్తి నుంచి స్వచ్ఛ ఇంధనం వరకు ప్రస్థానం రెండోదశతో మరోభారీ విస్తరణకు శ్రీకారం ఈనెల 14న 49వ వసంతంలోకి రామగుండం ఎన్టీపీపీ

విజయాల ఎన్టీపీసీ

జ్యోతినగర్‌: 1978 నవంబర్‌ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ శంకుస్థాపన చేసిన రామగుండంలోని ఎన్టీపీసీ ఈనెల 14న 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 1983 నవంబర్‌ 26న తొలి 200 మెగావాట్ల యూనిట్‌తో ఉత్పత్తి ప్రారంభించి, ఏడు యూనిట్ల ద్వారా 2,600 మెగావాట్ల థర్మల్‌ సామర్థ్యాన్ని సాధించింది. తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు తొలిదశలో ఒక్కోటి 800 మెగవాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు పూర్తి చేసుకుని, రెండోదశలో ఒక్కోటి 800 మెవాట్ల సామర్థ్యంతో మూడు యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ ఇంధనంలో 130 మెగావాట్ల గ్రౌండ్‌ మౌంటెడ్‌, 156 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. 2026 జూన్‌ 13న 100 ఎండబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌కు శంకుస్థాపన చేశారు.

భద్రతలో ఐఈఐ–ఎస్‌క్యూఎఫ్‌

23వ అంతర్జాతీయ భద్రతా సదస్సు–2026లో సేఫ్టీ ఇన్నోవేషన్‌ అవార్డు–2026 అందుకుంది. ఎంజీఆర్‌ రైలు మార్గంలో ఎస్‌అండ్‌టీ ఇంటర్‌లాక్డ్‌ లెవెల్‌ క్రాసింగ్‌లు ప్రారంభించింది. 100శాతం బూడిద వినియోగం సాధించి, సెనోస్పియర్‌ సేకరణ, అమ్మకాలు ప్రారంభించింది. సిమెంట్‌ ఫ్రీ ఫ్లై యాష్‌ బేస్డ్‌ జియోపాలిమర్‌ రోడ్డు నిర్మించింది. పర్యావరణ దినోత్సవం–2026 సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్టీపీసీ రామగుండం, ధన్వంతరి ఆసుపత్రిని సత్కరించింది. సీఎస్‌ఆర్‌లో భాగంగా రూ.43.5 లక్షల విలువైన రెండు అంబులెన్స్‌లను గోదావరిఖని, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు అందించింది. పారిశ్రామిక క్యాంటీన్‌ ప్రారంభించింది. హిందీ అమలులో ఉత్కృష్ట కార్యకారణ హేతు ప్రశంసాపత్రం పొందింది. ఉద్యోగులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు కార్మికుల శ్రమే విజయాలకు పునాది. ప్రస్తుతం థర్మల్‌ 4200, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి 286 మెగావాట్లు కలిపి 4,486 మెగావాట్ల ఉత్పత్తితో అతిపెద్ద హబ్‌గా ఉంది. స్టేజీ–2 పూర్తయితే 6,886 మెగావాట్లతో అతిపెద్ద విద్యుత్‌ ప్రాజెక్టుగా రామగుండంలోని ఎన్టీపీసీ ఆవిర్భవించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement