తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

బోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌ గ్రామంలో తాటిచెట్టు నుంచి పడి గీతకార్మి కుడు మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పల్లెర్ల పెద్ద నారాయణ (58) గీతకార్మికుడు. మంగళవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారి పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో చెట్టువద్దనే ప్రాణాలు కోల్పోయాడు. నారాయణ రాత్రి అయినా ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు వెతకగా చెట్టు వద్దే మృతి చెంది కనిపించాడు. నారాయణకు భార్య లక్ష్మి, ఆరుగురు కూతుర్లు, కుమారుడు రాజు ఉన్నారు. రాజు ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లగా తండ్రి మరణవార్త తెలుసుకుని బుధవారం స్వగ్రామం చేరుకుని, అంత్యక్రియలు పూర్తిచేశాడు.

కరెంట్‌ షాక్‌తో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ ..

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లిలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ వేల్పుల మహేశ్‌(36) కరెంట్‌ షాక్‌తో బుధవారం మృత్యువాత పడ్డాడు. రామగుండం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మహేశ్‌.. కొంతకాలంగా రంగంపల్లిలో నివాసముంటూ రంగంపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. విద్యుత్‌ మరమ్మతు పనుల్లో భాగంగా స్తంభం పైకి ఎక్కి ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మరణించాడు. ఘటనాస్థలాన్ని డీఈఈ రాజబ్రహ్మచారి, టౌన్‌ ఏఈ శ్రీనివాస్‌తోపాటు పలువురు అధికారులు సందర్శించి ప్రమాదఘటనకు కారణాలపై ఆరా తీశారు. మహేశ్‌కు భార్య సంధ్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మహేశ్‌ మృతికి అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

తక్కువ నీటితో సాగయ్యే పంటలే మేలు

పెద్దపల్లిరూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని, రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే మొక్కజొన్న, వేరుశనగ, పెసర, బబ్బెర లాంటి ఆరుతడి పంటలనే వేసుకోవాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. మేరపల్లి, బొంపల్లి, కాసులపల్లి, పాలితం, కనగర్తి గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే విక్రయించుకోవాలని సూచించారు. అప్పన్నపేట, పెద్దపల్లి సింగిల్‌విండో చైర్మన్లు చింతపండు సంపత్‌, ముత్యాల నరేశ్‌, అప్పన్నపేట సీఈవో గడ్డి తిరుపతితోపాటు నాయకులు గుర్రాల రాజు తదితరులున్నారు.

ఎన్నికల హామీని అమలు చేయాలి

పెద్దపల్లి: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించి, సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు. కొన్నేళ్లుగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు వేతన బకాయిలు, కనీస వేతనాలు, రెగ్యులరైజేషన్‌ కోసం పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించినా పరిష్కారం లభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో మహేందర్‌, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌, రమేశ్‌, ఎన్‌హెచ్‌ఎం, స్కైలాబ్‌రాణి, రమాదేవి, రాజేశ్వరి, రాజుబాయి, పద్మాంజలి, లక్ష్మణ్‌, నర్మద, రవళి, మేఘమాల తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement