కార్తీకం.. కానరాని భక్తి పారవశ్యం | - | Sakshi
Sakshi News home page

కార్తీకం.. కానరాని భక్తి పారవశ్యం

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

● ప్రాజెక్టు గర్భంలోకి చేరిన స్వయంభూ ఆలయాలు ● ప్రతిష్ఠించిన ఆలయాల్లో పూజలతో తరిస్తున్న ముంపుబాధితులు

● ప్రాజెక్టు గర్భంలోకి చేరిన స్వయంభూ ఆలయాలు ● ప్రతిష్ఠించిన ఆలయాల్లో పూజలతో తరిస్తున్న ముంపుబాధితులు

రామగుండం: సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ముర్మూర్‌ గ్రామస్తులు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే గోదావరిలో స్నానమాచరించి, గోదావరి జలాలతో గ్రామ నడిబొడ్డున స్వయంభూ వెలసిన శ్రీపాతాళేశ్వర, చెన్నకేశవ ఆలయాల్లో అభిషేకం, దీపారాధన చేసి రోజంతా ఉపవాసం ఉండేవారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ముర్మూర్‌ అసలు పేరు మునిపురం. మునులు నివసించిన గ్రామంగా ప్రసిద్ధి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో తొలి ముంపు గ్రామం ఇదే. ఇక్కడ గోదావరి సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ స్నానం కాశీలో చేసినంత పుణ్యఫలమని పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చేవారు. గ్రామం చుట్టూ 101 ఆంజనేయ విగ్రహాలతో అష్టదిగ్బంధనం, పాతాళేశ్వరాలయంలో మునులు ఏర్పాటు చేసిన సైకత శివలింగం, శ్రీచక్రంపై ఆసీనులైన చెన్నకేశవస్వామి ప్రత్యేకత. 1964లో నేదునూరి చెన్నకేశవరావు ఆధ్వర్యంలో అష్ట్రగహకూటమి నివారణకు 11 రోజులు మహాయాగం చేశారు.ప్రాజెక్టు వరద నీరు తగ్గినప్పుడు ఆలయాలు బయటపడితే బ్రాహ్మణ కుటుంబాలు నేటికీ వెళ్లి పూజలు చేస్తున్నారు.

స్వయంభూ ఆలయాలు ముంపులోకి చేరాయి

పునరావాస కాలనీలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసినా స్వయంభూ ఆలయాల్లో పూజించినంత పుణ్యఫలం రాదు. గ్రామం ముంపునకు గురికాక ముందు ప్రజలు ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా ఉండేవారు. – కమ్మల సత్యనారాయణశర్మ,

ముర్మూర్‌ బ్రాహ్మణ పూజారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement