● పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ | - | Sakshi
Sakshi News home page

● పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఎలిగేడు: ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలో రూ.5లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎంపీ మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం సుల్తాన్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లోని విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు అందజేశారు. ఎంఈవో నరేంద్రచారి, సర్పంచులు కప్పల ప్రవీణ్‌, కవ్వంపల్లి బాపయ్య, మాజీ సర్పంచ్‌ మండిగ రాయనర్సయ్య, కాంగ్రెస్‌ నాయకులు అడ్డగుంట శ్రీనివాస్‌గౌడ్‌, కవ్వంపల్లి స్వామి, న్యాతరి సంపత్‌, ముంజం ముత్యాలు, మంజంపల్లి రాకేశ్‌, జానీ, మూసాల మనోహర్‌రెడ్డి, కోట శ్రీకాంత్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement