అంతకు ముందు ఉన్నది కాకుండా.. ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపికచేశారు. ఈ జాబితా నా వద్ద ఉంది. లబ్ధిదారులు ఎలాంటి నివాసంలో ఉన్నారు, స్థలం లేనివారు ఎవరు అని గుర్తించి మళ్లీ ఎంపిక చేస్తాం. త్వరలోనే లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ చేపడతాం.
– ప్రసాదరావు, తహసీల్దార్, అంతర్గాం
ఆందోళన వద్దు
అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డబుల్‌బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం. ఇతర గ్రామాల్లోని లబ్ధిదారులను ఇందిరమ్మ పథకంలో చేర్చి లబ్ధి చేకూరుస్తాం. వివిధ శాఖల అధికారులతో క్షేత్ర సర్వే చేయించి జాబితా రూపొందిస్తాం.
– ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం


